ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం

ఉడుపి లేదా ఉడిపిలో నెలకొని వున్న శ్రీ కృష్ణ ఆలయం ప్రసిద్ద వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణుడు బాల కృష్ణుని రూపం‌లో వెలసిన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో బెంగళూరుకు సుమారు 500 కిలో మీటర్ల దూరం‌లో మరియు మంగుళూరుకు 80 కిలో మీటర్ల దూరం‌లో పచ్చని కొండల మధ్య ప్రశాంత సముద్ర తీరం‌లో నెలకొని ఉంది. పురాణ ప్రాశస్థం: పురాణ కధనం ప్రకారం చంద్రుడు ఈ ప్రాంతం‌లో దక్ష శాప విముక్తికై తపస్సు చేసి మహా శివుని తలపై శాశ్వత స్ఠానం పొందాడని, అందుకే ఈ ప్రాంతానికి ఉడు రాజు (చంద్రుని) అనే పదాన్ని అనుసరించి ఉడుపి అనే పేరు వచ్చినట్లుగా చెపుతారు. అందుకు ప్రామాణికంగా ఇక్కడ వున్న చంద్ర మౌళీశ్వరాలయం చూడవచ్చు. చారిత్రక ప్రాశస్థం: ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన శ్రీ మద్వాచార్యులు విళంబి నామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు (క్రీ.శ.1236) ప్రతిష్టింపజేసినట్లుగా చారిత్రక ఆధారాలు కలవు. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ద్వారక నుండి ఇక్కడకి వచ్చినట్లుగా భక్తులు భావిస్తారు. ఒకరోజు ద్వారక నుంచి సరుకుల రవాణా చేస్తున్న ఒక ఓడ గాలివానకు సముద్రం‌లో చిక్కుకుంది. అప్పుడు సముద్ర తీరం‌లో పూజలు నిర్వహిస్తున్న శ్రీ మద్వాచార్యులు తన మం...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం

    ఘాటి సుబ్రహ్మణ్య (ఘటి సుబ్రహ్మణ్య) దేవాలయం బెంగుళూరు నగర శివారులో గల దొడ్డబళ్ళాపూర్ సమీపంలోని ఘాటి అని పిలువబడే గ్రామంలో నెలకొని వున్న సుప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రం. హిందువులు సుబ్రహ్మణ్య స్వామిగా పిలువబడే కార్తికేయుడు పార్వతి పరమేశ్వరుల పుత్రుడు మరియు సర్పాలకు అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని భావిస్తారు. అలాగే భక్తులు తమ జాతకంలో కుజ, కాలసర్ప దోషంచే సకాలంలో పెళ్ళికాని వారు సుబ్రహ్మణ్య స్వామిని పుజిస్తారు. నాగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రాన్ని ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకొని తరిస్తుంటారు.      సుబ్రహ్మణ్య క్షేత్రం: కర్ణాటక రాష్ట్రం నందు మూడు ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది, మధ్య, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రాలు గా ప్రసిద్ధిచెందినవి. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ఆది సుబ్రహ్మణ్య క్షేత్రంగా, ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా మరియు పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా భక్తులు కొలుస్తారు. ఈ మూడు క్షేత్రాలను కలిపితే ఒక సర్ప...

న్యూఢిల్లీలోని లోటస్ టెంపుల్

Photo by Manish Sharma from Pexels లోటస్ టెంపుల్ అనేది భారత రాజధాని నగరమైన న్యూఢిల్లీలోని బహపూర్‌లో గల ప్రఖ్యాత అపురూపమైన ప్రార్ధనా మందిరం. చూడడానికి పెద్ద తామర పువ్వు ఆకారంలో నిర్మితమై ఉండటం వలన ఈ మందిరానికి లోటస్ టెంపుల్ (కమల మందిరం)అనే పేరు వచ్చింది. అధునిక కాలం‌లో మన దేశం‌లోని అద్భుత నిర్మాణాలలో ఒకటిగా పేర్కొనవచ్చు. కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఇక్కడకు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఈ ఆలయం‌ బహాయి మతానికి చెందినది. మానవ జాతి ఏకత్వాన్ని విశ్వసించే బహాయి మత సిద్ధాంతం ప్రకారం దేవుడు నిరాకారుడు. అందువలన ఈ ఆలయం‌లో ప్రత్యేకించి ఏ దేవుడు ఉండడు. ఇక్కడ ఏ మతాన్ని అవలంబించేవారైనా సరే వారి మత గ్రంధాలను వారి బాషలో జపించుకోవచ్చు లేదా చదువుకోవచ్చు కాని వాటిపై ఉపన్యాసాలు ఇవ్వడానికి అనుమతించరు. ప్రత్యేకమైన ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రాంతాన్ని హైదరాబాద్‌కు చెందిన అర్దిషీర్ రుస్తం‌పూర్ (Ardishr Rustampur) విరాళంగా ఇచ్చారు. ఈ నిర్మాణం కోసం తన యావదాస్థిని ఇచ్చారు. ఇరానీ శిల్పకారుడు ఫరీబోజ్‌ సహ్‌బా (Fariborz Sahba) సారధ్యం‌లో ఈ ఆలయ నిర్మాణం ఆరేళ్లపాటు కొనసాగి నవంబర్ 13, 1986 న పూర్తయింది. యు.కె.క...

భారత పార్లమెంటు భవనానికి స్పూర్తి అయిన చౌసత్ యోగిని ఆలయం

పార్లమెంటు భవన్ అనేది భారత దేశం యొక్క అత్యున్నత చట్ట సభ. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన దీనినే పార్లమెంటు హౌస్ లేదా సంసద్ అని పిలుస్తారు. (సంసద్ అంటే సంస్కృతం‌లో ఇల్లు లేక భవనం అని అర్ధం). ఈ భవనం క్రొత్త ఢిల్లీలోని జనపథ్ రోడ్డులో వలయాకార నిర్మాణం‌లో వుండి ప్రధాన ఆకర్షణగా రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌కు కూతవేటు దూరం‌లో కలదు. వృత్తాకారం‌లో నిర్మింపబడిన ఈ బిల్డిం‌‌‌గ్ కాంప్లెక్స్ మధ్యలో 144 స్తం‌భాలతో కూడిన వరండా కలిగిన గోపురం‌తో సెంట్రల్ హాల్ ఎంతో ఠీవిగా నిలుస్తుంది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఇందులో విస్త్రతమైన గ్రంధ సేకరణతో కూడిన ఒక గొప్ప గ్రంధాలయం, వివిధ మంత్రి వర్గ కార్యాలయాలు వాటికి అనుబంధ కార్యాలయములు కొలవై ఉన్నాయి. భారత దేశాన్ని ఈస్టిండియా కంపెని వారు ఢిల్లీ రాజధానిగా పాలించాలని నిర్ణయించాక పరిపాలనా భవనాల నిర్మాణాలను చేపట్టారు. అందుకోసం సర్ ఎడ్డిన్ లూటెన్స్, సర్ హెర్బెర్ట్ అనే ఇద్దరు బ్రిటిష్ ఇంజనీర్లను నియమించారు. వీరిలో సర్ ఎడ్డిన్ లూటెన్స్ మధ్యప్రదేశ్‌‌లోని మతౌలీ అనే మారుమూల ప్రారంభించి ఆరేళ్ల తరువాత జనవరి 18, 1927 న నాటి వైస్రాయ్ లార్...

ఢిల్లీలోని ప్రసిద్ధి ఎర్ర కోట

Image by Shouvik Raychowdhury from Pixabay ఎర్ర కోట లేదా లాల్ ఖిలా అనే కట్టడం పాత ఢిల్లీలోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో అతి పెద్ద చారిత్రక నిర్మాణం. ఈ కోటను ఎర్రని ఇసుకరాయి ఉపయోగించి నిర్మించడం వలన ఎరుపు రంగులో ఉండి, ఎర్ర కోటగా ప్రసిద్ధిచెందింది. ప్రతి ఏడాది మన దేశం స్వాతంత్ర్యం పొందిన రోజైన ఆగస్టు 15 వ తేదీన భారత ప్రధానమంత్రి మువ్వన్నెల జెండాని ఎగరవేసి తదుపరి దేశానుద్దేశించి ఇక్కడి నుండే ప్రసంగిస్తారు. ఈ ఎర్ర కోట 2007 వ సంవత్సరములో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా UNESCO సంస్థ వారిచే ప్రకటించబడింది. 1649 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఎర్ర కోటను నిర్మించగా, ఎర్ర కోట కేంద్రం‌గా ఢిల్లీ నగరం ఏడు సార్లు నిర్మితమైంది. మొఘల్ సామ్రాజ్య వైభవానికి, పతనానికి ఈ కోట సాక్షీభూతం‌గా నిలిచింది. ఆగస్టు 15, 1947 న భారతదేశ స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ మన జాతీయ పతాకాన్ని ఇక్కడే ఎగురవేసి ప్రసంగించారు. నాటి నుం‌‌‌చి ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇదే సంప్రదాయం ఈనాటికీ కొనసాగుతూ ఉంది. ఎర్ర కోట చరిత్ర: ఈ కోటను మొదటిసారిగా తోమారా రాజు అనంగ్‌పాలా...