పోస్ట్‌లు

జనవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

బాబా నడయాడిన షిరిడి క్షేత్రం

చిత్రం
షిరిడి (షిర్డీ) మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం. సాయి బాబా నడయాడిన షిరిడిని జీవితం‌లో ఒక్కసారైనా దర్శించాలని ఆయన భక్తులు ఆకాంక్షిస్తారు. ఇక్కడి నెలకొని ఉన్న శ్రీ సాయి బాబా మందిర్‌ను దర్శించడానికి దేశం‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. సాయి బాబా అసలు పేరు, జన్మ స్థలం, తల్లిదండ్రులు గురించి తెలియదు. కొన్ని అధ్యయనాల ప్రకారం శ్రీ సాయి బాబా తన 16వ వయస్సులో షిరిడికి వచ్చి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి తరువాత కొంత కాలం కనిపించలేదని ఆయన భక్తులు భావిస్తారు. ఆ కనుపించని సమయం‌లో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. పిదప కొంత కాలానికి ఔరంగాబాద్ జిల్లా ధూప్ ఖేడా గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే వ్యక్తి తన బావమరిది కొడుకు పెళ్ళి కోసం ఎడ్లబండిలో షిరిడీ వెళుతుండగా వారితో పాటు కలిసి షిరిడి వచ్చారని భావిస్తారు. ఆయన షిరిడి వచ్చినప్పుడు ఖండోబా ఆలయ సమీపంలో ఆలయ పూజారి మహల్సాపతి “ఆవో సాయీ” (తెలుగులో రండి సాయీ అని అర్ధం) అని పిలిచారు. ఆ విధంగా “సాయి” అనే పేరు స్థిరపడి ఆయన “షిరిడి సాయి బాబా”గా ప్రసిద్ధుడైనాడు. షిరిడీలో ఒక పాత మసీదులో నివసించేవాడు. ఈ మసీదునే “ద్వారక

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

చిత్రం
అరుణాచలేశ్వరుడు నెలకొనివున్న అరుణాచలం ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రము. దీనినే తమిళులు ‘అణ్ణామలై’ లేదా ‘తిరువణ్ణామలై’ అంటారు. తిరువణ్ణామలై తమిళనాడు రాష్టంలో ఉన్న తిరువణ్ణామలై జిల్లాలో వెలసి ఉంది. ఇది శైవులకు ఎంతో ముఖ్యమైన క్షేత్రము. తిరువణ్ణామలై పంచ భూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం పంచలింగ క్షేత్రములలో అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు తమిళనాడులోని చిదంబరం క్షేత్రం ఆకాశమును, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తి క్షేత్రం వాయువును, తమిళనాడులోని తిరువనైకోవిల్ క్షేత్రం నీటిని మరియు తమిళనాడులోని కంచి క్షేత్రం భూమిని సూచిస్తాయి. స్థల పురాణం: పూర్వం బ్రహ్మ విష్ణువుల మద్య జరిగిన తగువును తీర్చడానికి మహా శివుడు వారిద్దరి మద్య అగ్ని లింగంగా ఆవిర్భవించాడు. అప్పుడు ఉద్బవించిన ప్రకాశవంతమైన కాంతిని చూడలేక బ్రహ్మ విష్ణువులతో పాటు సకల దేవతలు ప్రార్ధించగా మహా శివుడు ఎర్రని శిల (కొండ) రూపం‌లో సాక్షాత్కరించాడు అదే అరుణాచలముగా పిలవబడుతుంది. అరుణ అనగా ఎర్రని, అచలము అనగా కొండ అని అర్ధము. ఎర్రని అరుణ రూపం‌లో వెలసిన పర్వతం కనుక అరుణాచలంగా ప్రసిద్ధిచెందింది. అలాగే 'అణ్ణాల్‌

మైసూరులో నెలకొనివున్న శ్రీ చాముండేశ్వరీ ఆలయం

చిత్రం
శ్రీ చాముండేశ్వరీ ఆలయం కర్ణాటక రాష్ట్రం‌లోని ప్రధాన నగరాలలో ఒకటైన మైసూరు నగరానికి తూర్పున సుమారు 12 కి.మి.ల దూరం‌లో గల చాముండీ పర్వతం‌పై నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. ఈ నగరాన్నే క్రౌంచపురి, క్రౌంచ పట్టణం, క్రౌంచ పీఠంగా పిలుస్తుంటారు. పురాణ ప్రాశస్థం: పూర్వం మహిషపురిగా పిలవబడే ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించేవాడు. ఈ రాక్షసుడు పరమశివుడిని తన కఠోర తపస్సుతో మెప్పించి, లోకం‌లోని ఏ పురుషుడి చేతిలో మరణించకుండా వుండేలా వరం పొందాడు. మహిషాసురుడుని వధించుటకై శ్రీ చాముండేశ్వరీ దేవి శక్తి స్వరూపిణిగా అవతరించి, మహిషాసురుని సంహరించి మహిషాసురమర్ధినిగా ప్రసిద్ధమైనది. శక్తి పీఠం: హిందూ పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం సమయం‌లో సతీ దేవి ప్రాణ త్యాగం చేసినప్పుడు, పరమ శివుడు ఆమె శరీరాన్ని తన భుజాన వేసుకొని రుద్రతాండవం చేశాడు. ఆ సమయం‌లో విష్ణు దేవుడు తన చక్రం‌తో ఆమె శరీరాన్ని ఖండించగా, ఆ శరీర బాగాలు దేశం‌లోని పద్దెనిమిది ప్రాంతాలలో పడి ఆ ప్రాంతాలు అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్దిగాంచాయి. వాటిలో నాల్గవ శక్తి పీఠమే శ్రీ చాముండేశ్వరీ క్షేత్రం. ఈ పీఠం‌పై