పోస్ట్‌లు

నవంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సెయింట్ ఫిలోమినా చర్చి

చిత్రం
మైసూరు నగరంలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో సెయింట్ ఫిలోమినా చర్చి ఒకటి. దీనినే సెయింట్ జోసెఫ్ చర్చి అని కూడా అంటారు. ఈ చర్చి ఆసియాలోనే రెండవ అతి పొడవైన చర్చిగా గుర్తింపు ఉంది. ఈ చర్చిని కాథలిక్ సెయింట్, రోమన్ కాథలిక్ చర్చి మార్టిర్ అయిన సెయిం‌ట్ ఫిలోమినా గౌరవార్ధం మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ నిర్మించారు. టిప్పు సుల్తాన్ అనంతరం మైసూరు రాజ్యానికి రాజధానిగా శ్రీరంగపట్నం నుండి మైసూరు నగరానికి మార్చబడినది. అప్పుడు అనేక బ్రిటీష్ అధికారులు మరియు సైనికులు వచ్చి మైసూరులో స్థిరపడినారు. అప్పటి మహారాజా కృష్ణరాజ వడయార్ III ఈ వ్యక్తుల కోసం ఒక క్రైస్తవ చర్చి అవసరాన్ని గుర్తించి, 1843 సంవత్సరంలో నిర్మించినారు. కాలక్రమం‌లో నగరం విస్తరించడం మరియు నగరంలో క్రిస్టియన్ జనాభా పెరుగుతుండగా ప్రస్తుత రూపంలో ఉన్న ఈ చర్చిని 1933 సంవత్సరంలో మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ IV తన తాత నిర్మించిన చిన్న చర్చి స్థానంలో పునర్నిర్మించారు. ఈ చర్చి గోతిక్ శైలిలో జర్మనీలోని కొలోన్ కెథడ్రల్ చర్చి ప్రేరణతో నిర్మించబడింది. దీనిలోని నిర్మాణాలు పురాతన శైలి కలిగి ఉండి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి. చ

మైసూరు మహారాజుల రాజ సౌధం అంబా విలాస్ ప్యాలెస్

చిత్రం
రాజభవనాల నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూరును సందర్శించే పర్యాటకులు తప్పక చూడవలసిన 7 రాజభవనాల్లో అంబా విలాస్ ప్యాలెస్ ఒకటి. దీనినే ‘మైసూరు ప్యాలెస్’ లేదా ‘మైసూరు మహారాజా ప్యాలెస్’ అని కూడా పిలుస్తుంటారు. మైసూరు మహారాజ కుటుంబీకుల కొరకు ఈ ప్యాలెస్ భవనాన్ని నిర్మించారు. 14 వ శతాబ్దం‌లో నిర్మింపబడిన ఈ భవనం అనేక పర్యాయాలు పునర్మించి ప్రస్తుత ప్యాలెస్ భవనాన్ని నిర్మిచారు. బ్రిటీష్ ఆర్కిటెక్ అయిన హెర్నీ ఇర్విన్‌ సారధ్యం‌లో ఇండో సార్సెనిక్, ద్రవిడ, మొగలుల, రోమన్, మరియు ప్రాచ్య దేశాల నిర్మాణాల శైలిలో 1897 – 1912 సంవత్సరాల మధ్య నిర్మించబడినది. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ 41,47,913/- వ్యయం అయ్యింది. 1912 సంవత్సరములో ప్యాలెస్ నిర్మాణం పూర్తయినప్పటికి, తదనంతర కాలం‌లో ప్యాలెస్ ఆధునీకరణ పనులు జరిగాయి. ఈ ఆధునీకరణ పనులలోనే ప్రజా దర్బార్ నిర్మించారు. ప్యాలెస్ భవనం తూర్పు దిక్కు అభిముఖంగా ఉంటుంది. రాజ భవనం‌లోనికి ప్రవేశించడానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ప్రవేశ ద్వారాన్ని ‘జయ మార్తాం‌‌డ ద్వారం’ అని, ఉత్తర ప్రవేశ ద్వారాన్ని ‘జయరామ ద్వారం’ అని, దక్షిణ ప్రవేశ ద్వారాన్ని ‘బల

రాజప్రాసాదాల నగరం మైసూరు

చిత్రం
మైసూరు ప్యాలెస్ మైసూరు నగరాన్ని కర్ణాటక రాష్టానికి సాంస్కృతిక రాజధానిగా పేర్కొంటారు. ఈ నగరములో రాజరిక వారసత్వాన్ని ప్రతిబింబించే పెద్ద రాజ భవనాలు, విశాలమైన రోడ్లు, మ్యూజియంలు, సరస్సులు, ప్రఖ్యాత పట్టు చీరలు, యోగా కేంద్రాలు, చందనం తోటలు వంటి ఎన్నో ప్రత్యేకతలు సందర్శకులకు ఎప్పటికి మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. పర్యాటకులు ఈ నగరాన్నే ‘ఐవరీ సిటీ’ లేదా ‘రాజప్రాసాదాల నగరం’ అని పిలుస్తుంటారు. ఇక్కడి గంధపు ఉత్పత్తులు ఈ నగరాన్ని ‘శాండల్ ఉడ్ సిటి’ అని పేరు తెచ్చిపెట్టాయి. మైసూరు నగరంలో యోగా కేంద్రాలు అధికంగా కనపడే కారణంగా దీనిని ‘యోగా సిటి’ అని కూడా పిలుస్తుంటారు. పురాణ ప్రాశస్థం: మహిషాసురుని విగ్రహం ముందు భారతీయ ఇతిహాసాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించేవాడు. అతని పేరుతోనే ఈ ప్రాంతానికి ‘మహిష - ఊరు’ అని నామకరణం చేయబడింది. కాలక్రమేణా అది ‘మహిషూరు’గా రూపొంది, ఆంగ్లేయుల రాకతో అది “మైసూరు”గా స్ధిరపడింది. ఈ రాక్షసుడుని ఇక్కడి ప్రాంత ప్రజలు కొలిచే చాముండి దేవి సంహరించినట్లు చెపుతారు. నేటి మైసూరు నగరానికి తూర్పున ఉన్న కొండపై చాముండేశ్వరీ దేవాలయం నెలకొని ఉంటుంది.