పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

చావక్కాడ్ బీచ్: గురువాయూర్ తీరం‌లోని సుందర బీచ్

చిత్రం
గురువాయూర్ క్షేత్రానికి సమీపం‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలలో చావక్కాడ్ (చవక్కాడ్) బీచ్ ఒకటి. సుందమైన ఈ బీచ్ గురువాయూర్ పట్టణానికి సుమారు 5 కిమీల దూరం‌లో ఉన్న చావక్కాడ్ (Chavakkad) పట్టణానికి 2 కిమీల దూరం‌లో ఉన్నది. ఇక్కడ సమృద్ధిగా పెరిగే చేవల్ చెట్ల వలన ఈ ప్రాంతానికి చావక్కాడ్ అని పేరు వచ్చిందని స్ఠానికులు చెపుతారు. కూట్టుంగళ్ లేదా కూట్టుంగళంగడిగా పిలువబడే ఈ ప్రాంతం పూర్వ యుగంలో వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆంగ్లేయులు ఈ పట్టణాన్ని ‘చౌఘాట్’ అని పిలిచేవారు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం వారు 1970ల ప్రారంభంలో చావక్కాడ్ పేరు మార్చినారు. చావక్కాడ్ బీచ్ 'అజిమోకం' (Azhimukham) అని పిలువబడే దృశ్యానికి ప్రసిద్ధి చెందింది. మలయాళంలో అజిమోకం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశం అని అర్థం. అరేబియా సముద్రపు తీరంలో జాతీయ రహదారి ప్రక్కనే గల ఈ బీచ్ కేరళలోని ఇతర బీచ్‌లతో పోలిస్తే రద్దీ తక్కువ. ఆధునీకరణ స్పృశించని ఈ బీచ్ చుట్టూ ఏపుగా పెరిగిన తాటి చెట్లతో ఎంతో ఆహ్లాదకరపు అనుభవం కలిగిస్తుంది. బీచ్‌లో మృదువైన ఇసుకతో ఎంతో పరిశుభ్రతగా ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను విశేషంగా

పున్నత్తూర్‌ కోట: గురువాయూర్ ఏనుగులశాల

చిత్రం
భూలోక వైకుంఠమైన గురువాయూర్ నందు శ్రీ కృష్ణుడు బాల కృష్ణునిగా కొలువుదీరి గురువాయూరప్పన్‌గా పూజలందుకొంటున్నాడని తెలుసు కదా! ఇక్కడ భక్తులు స్వామి వారిని దర్శించి వారు కోరిన కోరికలు నెరవేరిన తరువాత వారు స్వామి వారికి అనేక రకాల కానుకలను భక్తితో సమర్పిస్తారు. కొంతమంది భక్తులు స్వామి వారికి కానుకగా ఏనుగులను కూడా సమర్పించుకొనే సంప్రదాయం ఇక్కడ ఉంది. అలా సమర్పించిన ఏనుగులు సుమారు 80 కి పైగా ఉన్నాయి. ఈ ఏనుగులను ఆలయానికి సుమారు 3 కిమీ దూరంలో ఉన్న పున్నత్తూర్‌ కోట (పున్నథూర్ కొట్టా) లో వున్న ఏనుగులశాలలో ఉంచి సం‌రక్షిస్తున్నారు. ఈ ఏనుగులు గురువాయూర్ దేవాలయం నిర్వహించే అనేక పండుగలలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రని పోషిస్తాయి. ఒకప్పడు స్థానిక పున్నత్తూర్ రాజ వంశీయులకు సంబంధించిన ఈ కోట మరియు ప్యాలెస్ గురువాయూర్ దేవస్ఠానం వారు 1975 సంవత్సరములో తమ ఆధీనములోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ మైదానం‌లో గురువాయూర్ ఆలయానికి చెందిన ఏనుగులను సంరక్షిస్తున్నారు. దీనికి "పున్నతుర్ అనక్కొట్ట" అని పేరు పెట్టారు, అనగా ‘ఏనుగుల కోట’ అని అర్ధం వస్తుంది. పున్నత్తూర్‌ కోటలోని స్ఠానిక ఆకర్షణలు: పున్నత్త