పున్నత్తూర్‌ కోట: గురువాయూర్ ఏనుగులశాల

భూలోక వైకుంఠమైన గురువాయూర్ నందు శ్రీ కృష్ణుడు బాల కృష్ణునిగా కొలువుదీరి గురువాయూరప్పన్‌గా పూజలందుకొంటున్నాడని తెలుసు కదా! ఇక్కడ భక్తులు స్వామి వారిని దర్శించి వారు కోరిన కోరికలు నెరవేరిన తరువాత వారు స్వామి వారికి అనేక రకాల కానుకలను భక్తితో సమర్పిస్తారు. కొంతమంది భక్తులు స్వామి వారికి కానుకగా ఏనుగులను కూడా సమర్పించుకొనే సంప్రదాయం ఇక్కడ ఉంది. అలా సమర్పించిన ఏనుగులు సుమారు 80 కి పైగా ఉన్నాయి. ఈ ఏనుగులను ఆలయానికి సుమారు 3 కిమీ దూరంలో ఉన్న పున్నత్తూర్‌ కోట (పున్నథూర్ కొట్టా) లో వున్న ఏనుగులశాలలో ఉంచి సం‌రక్షిస్తున్నారు. ఈ ఏనుగులు గురువాయూర్ దేవాలయం నిర్వహించే అనేక పండుగలలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రని పోషిస్తాయి.


ఒకప్పడు స్థానిక పున్నత్తూర్ రాజ వంశీయులకు సంబంధించిన ఈ కోట మరియు ప్యాలెస్ గురువాయూర్ దేవస్ఠానం వారు 1975 సంవత్సరములో తమ ఆధీనములోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ మైదానం‌లో గురువాయూర్ ఆలయానికి చెందిన ఏనుగులను సంరక్షిస్తున్నారు. దీనికి "పున్నతుర్ అనక్కొట్ట" అని పేరు పెట్టారు, అనగా ‘ఏనుగుల కోట’ అని అర్ధం వస్తుంది.

పున్నత్తూర్‌ కోటలోని స్ఠానిక ఆకర్షణలు:

పున్నత్తూర్‌ కోటలో కేరళ సంప్రదాయం‌ ప్రకారం నిర్మించిన దీర్ఘచతురస్రాకార ఇల్లు ఉంది. దీనిని ‘నాళు కెట్టు’ (naalu kettu) అని పిలుస్తారు. ఇది పున్నతుర్ రాజాకు సంబంధించిన మధ్య ప్రాంగణం కలిగిన సాంప్రదాయ దీర్ఘచతురస్రాకార ఇల్లు. ఇది ప్రస్తుతం పాపన్స్ (మహౌట్) కోసం శిక్షణా పాఠశాలను కలిగి ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడికి సేవ చేయడానికి ఇవ్వడానికి అలాగే ఏడాది పొడవునా జరిగే అనేక పండుగలలో పాల్గొనడానికి ఏనుగులకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రాంగణం‌లో మాహా శివుడు మరియు భగవతి దేవికి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఏనుగులకు స్నానం చేయించడాన్ని, గజపూజ (ఏనుగులను పూజించడం) మరియు అనయూట్టు (ఏనుగులకు ఆహారం ఇవ్వడం) వంటి వాటిని చూడవచ్చు.

Image: Naalu kettu, Courtesy by Wikipedia

గురువాయూర్ ఏనుగులలో ‘కేశవన్‘ అన్న ఏనుగు ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. కేశవన్ సత్ప్రవర్తనతో గురువాయురప్పకు సేవ చేసిందని గజరాజు బిరుదును కూడా ఇచ్చారు. 1975 లో వచ్చిన మలయాళ సినిమా ‘గురువాయూర్ కేశవ’ సినిమాకు ఈ ఏనుగు ప్రేరణగా చెబుతారు. అలాగే మమ్ముట్టి నటించిన ప్రముఖ మలయాళ చిత్రం "ఒరు వడక్కన్ వీరగాథ" లోని కొన్ని సన్నివేశాలను ఈ ప్రదేశంలో చిత్రీకరించారు.

స్ఠానిక ఇతర ఆకర్షణలు:

గురువాయురప్పన్ ఆలయం, మమ్మీయూర్ మహాదేవాలయం, మ్యూజియం, తిరు వెంకటాచలపతి ఆలయం, పార్ధసారధి ఆలయం, నెన్ మెని బలరామ ఆలయం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మురళ్ పెయింట్స్, చవకాడ్ బీచ్, పాలయూర్ చర్చి మొదలైనవి.

ఇతర బ్లాగ్ ఆర్టికల్స్ కొరకు వీటిపై క్లిక్ చేయండి.

పున్నత్తూర్‌ కోట ప్రవేశ సమయాలు:

గురువాయూర్ టెంపుల్ సందర్శించిన యాత్రికులు విరామ సమయం‌లో ఈ పున్నత్తూర్‌ కోటను సందర్శించవచ్చు. పున్నత్తూర్‌ కోటలోనికి ప్రవేశించుటకు ప్రత్యేక ప్రవేశ రుసుము చెల్లించాలి. సందర్శన వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 5.00 వరకు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.10. కాంప్లెక్స్ లోపల కెమెరాను ఉపయోగించేందుకు అదనంగా రూ. 25 వసూలు చేస్తారు. ఇప్పుడు పున్నతుర్కోటలో కెమెరా వినియోగం అనుమతించబడదు

పున్నత్తూర్‌ కోటకి ఎలా చేరుకోవాలి?

గురువాయూర్ ఆలయం నుంచి పున్నత్తూర్‌ కోట సుమారు 3 కిమీ దూరంలో దూరంలో నెలకొని ఉంది. గురువాయురప్పన్ ఆలయం నుండి నడక ద్వారా లేదా ఆటో ద్వారా పున్నత్తూర్‌ కోట చేరుకోవచ్చు. గురువాయూర్ బస్సు లేదా రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చును.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం