పోస్ట్‌లు

అక్టోబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అల వైకుంఠపురం సినిమా నుంచి "సామజవరగమనా" పాట

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలు నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తె ఎలా నిట్టూర్చవటే నిష్టూరపువిలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు మల్లెల్ల మాసమా మంజుల హాసమా ప్రతి మలపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన ఫించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నెల వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే

దేవనహళ్ళి: టిప్పు సుల్తాన్ జన్మ స్థలం

చిత్రం
దేవనహళ్ళి కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు గ్రామీణ జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఇది బెంగుళూరు నగరానికి 35 కి.మీ.ల దూరంలో ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం వలన ఈ ప్రాంతము రియల్ఎస్టెట్ వ్యాపారానికి ప్రసిద్దిగాంచినది. అంతేకాకుండా ఈ ప్రదేశం పర్యాటక మరియు వారసత్వ సన్నిధిగా పేర్కొనవచ్చు. 18వ శతాబ్దం‌లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని సవాల్ చేసి, వారికి ఎదురొడ్డి పోరాడిన టిప్పు సుల్తాన్ ఇక్కడే జన్మించినాడు. నేను హైదరాబాద్ నుండి బెంగళూరుకు ప్రయాణించేటప్పుడు జాతీయ రహదారి (NH-7) లో దేవనహళ్ళి గ్రామం‌లో ప్రభుత్వ ఆర్కియాలజి సర్వే వారి హోర్డింగ్ మరియు కోట ఆసక్తిగొలుపినది. కొంత కాలం తరువాత నేను దేవనహళ్ళిని సందర్శించడం జరిగినది. దేవనహళ్ళి చరిత్ర: దేవనహళ్ళి కోట దేవనహళ్ళి తొలుత గంగవాడి రాజుల పాలనలో తరువాత రాష్ట్ర కూటులు, పల్లవుల, చోళుల, హోయసల, విజయనగర రాజుల పరిపాలనలో ఉండినది. విజయనగర రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు స్థానిక పాలెగాడైన ‘రణ బైర గౌడ’ కుమారుడు ‘మల్ల బైరె గౌడ’ ఈ ప్రాంతం‌లో 1501 సంవత్సరములో కోటను నిర్మించాడు. తొలుత ఇది మట్టితో నిర్మించారు

శ్రీ రంగపట్టణంలోని శ్రీ రంగనాధ స్వామి ఆలయం

చిత్రం
కర్ణాటక రాష్ట్రములోని మాండ్య జిల్లాలో గల శ్రీ రంగపట్టణం లోని శ్రీ రంగనాధ స్వామి ఆలయం దక్షిణ భారతదేశం‌లోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం మైసూరు నగరానికి అతి సమీపములో ఉన్నది. ఇక్కడ వెలసియున్న శ్రీ రంగనాధ స్వామి వలన ఈ పట్టణానికి శ్రీ రంగపట్టణం అనే పేరు వచ్చింది. దీనినే శ్రీ రంగపట్న లేదా శిరంగ పట్టణ్ అని కూడా అంటారు. ఈ ప్రదేశం చుట్టూ కావేరి నది రెండు పాయలుగా ప్రవహించుట వలన శ్రీ రంగపట్టణం ఒక సుందర ద్వీపం‌లా కనుపడుతుంది. శ్రీ రంగనాథుడు: పాల సముద్రంలో శేష పానుపుపై పవళించి ఉండే భంగిమలో కనిపించే శ్రీ రంగనాథుడిని శ్రీ మహా విష్ణువు స్వరూపాలలో ఒకటిగా భక్తులు కొలుస్తుంటారు. ఈ క్షేత్రం‌లో స్వామి వారు కావేరి సమేతంగా దర్శనమిస్తాడు. అయితే ఉత్సవ మూర్తులలో మాత్రం శ్రీ దేవి, భూదేవి అమ్మవార్లు మాత్రమే దర్శనమిస్తారు. కావేరి నదికి శ్రీ రంగనాథునికి ఉన్న సంబంధం విశిష్టమైనది. దేశం‌లోని ప్రముఖ పంచ రంగ క్షేత్రాలలో మూడు క్షేత్రాలు కావేరి నది ఒడ్డునే వెలసియున్నాయి. అవి కావేరి నది మొదట్లో కర్ణాటకలోని శ్రీరంగపట్నం వెలసిన రంగనాథుడ్ని ఆది రంగ గాను, కర్ణాటక రాష్ఱం‌లోని శివన సముద్రంలో వెలిసిన రంగనాథుడ్