పోస్ట్‌లు

సెప్టెంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ

చిత్రం
నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. హిందూ మస్లిం‌‌లు ఐక్యమత్యం‌తో జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి. దర్గాలోని షహీద్‌లను దర్శించుకునేందుకు దేశం‌ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కుల మతాలకు అతీతంగా భక్తులందరూ ఒక్కటై రొట్టెలు పంచుకునే ఈ రొట్టెల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రోగాలు నయమవుతాయని, వివాహ, ఉద్యోగ, సంతానం, ఆయురారోగ్యాలు సిద్ధిస్థాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు ఇంటి వద్ద రొట్టె (చపాతీ) లను తయారు చేసుకువచ్చి, స్వర్ణాల చెరువులోని నీళ్ళల్లో దిగి రొట్టెలను మార్పిడి చేసుకుంటారు. కోరిన కోర్కెకు సంభంధించిన రొట్టెను స్వీకరించి బదులుగా మరుసటి ఏడాది ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువులో భక్తులకు పంచుతారు. బారా షహీద్ దర్గా: మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచానికి అందజేయుటకు 12 మంది మత బోధకులు భారత దేశానికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా వీరు నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలములోని గండవరం చేరగా, గండవరం చెరువు వద్ద వీరికి మరియు ఇస్లామేతరులకు యుద్దం జరిగినది. ఈ యుద్దం‌లో వీరు మరణం చెందారు. వీరి తల