పోస్ట్‌లు

అక్టోబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం

చిత్రం
ఉడుపి లేదా ఉడిపిలో నెలకొని వున్న శ్రీ కృష్ణ ఆలయం ప్రసిద్ద వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణుడు బాల కృష్ణుని రూపం‌లో వెలసిన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో బెంగళూరుకు సుమారు 500 కిలో మీటర్ల దూరం‌లో మరియు మంగుళూరుకు 80 కిలో మీటర్ల దూరం‌లో పచ్చని కొండల మధ్య ప్రశాంత సముద్ర తీరం‌లో నెలకొని ఉంది. పురాణ ప్రాశస్థం: పురాణ కధనం ప్రకారం చంద్రుడు ఈ ప్రాంతం‌లో దక్ష శాప విముక్తికై తపస్సు చేసి మహా శివుని తలపై శాశ్వత స్ఠానం పొందాడని, అందుకే ఈ ప్రాంతానికి ఉడు రాజు (చంద్రుని) అనే పదాన్ని అనుసరించి ఉడుపి అనే పేరు వచ్చినట్లుగా చెపుతారు. అందుకు ప్రామాణికంగా ఇక్కడ వున్న చంద్ర మౌళీశ్వరాలయం చూడవచ్చు. చారిత్రక ప్రాశస్థం: ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన శ్రీ మద్వాచార్యులు విళంబి నామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు (క్రీ.శ.1236) ప్రతిష్టింపజేసినట్లుగా చారిత్రక ఆధారాలు కలవు. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ద్వారక నుండి ఇక్కడకి వచ్చినట్లుగా భక్తులు భావిస్తారు. ఒకరోజు ద్వారక నుంచి సరుకుల రవాణా చేస్తున్న ఒక ఓడ గాలివానకు సముద్రం‌లో చిక్కుకుంది. అప్పుడు సముద్ర తీరం‌లో పూజలు నిర్వహిస్తున్న శ్రీ మద్వాచార్యులు తన మం

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

చిత్రం
శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర