పోస్ట్‌లు

మే, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఢిల్లీలోని ప్రసిద్ధి ఎర్ర కోట

చిత్రం
Image by Shouvik Raychowdhury from Pixabay ఎర్ర కోట లేదా లాల్ ఖిలా అనే కట్టడం పాత ఢిల్లీలోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో అతి పెద్ద చారిత్రక నిర్మాణం. ఈ కోటను ఎర్రని ఇసుకరాయి ఉపయోగించి నిర్మించడం వలన ఎరుపు రంగులో ఉండి, ఎర్ర కోటగా ప్రసిద్ధిచెందింది. ప్రతి ఏడాది మన దేశం స్వాతంత్ర్యం పొందిన రోజైన ఆగస్టు 15 వ తేదీన భారత ప్రధానమంత్రి మువ్వన్నెల జెండాని ఎగరవేసి తదుపరి దేశానుద్దేశించి ఇక్కడి నుండే ప్రసంగిస్తారు. ఈ ఎర్ర కోట 2007 వ సంవత్సరములో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా UNESCO సంస్థ వారిచే ప్రకటించబడింది. 1649 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఎర్ర కోటను నిర్మించగా, ఎర్ర కోట కేంద్రం‌గా ఢిల్లీ నగరం ఏడు సార్లు నిర్మితమైంది. మొఘల్ సామ్రాజ్య వైభవానికి, పతనానికి ఈ కోట సాక్షీభూతం‌గా నిలిచింది. ఆగస్టు 15, 1947 న భారతదేశ స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ మన జాతీయ పతాకాన్ని ఇక్కడే ఎగురవేసి ప్రసంగించారు. నాటి నుం‌‌‌చి ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇదే సంప్రదాయం ఈనాటికీ కొనసాగుతూ ఉంది. ఎర్ర కోట చరిత్ర: ఈ కోటను మొదటిసారిగా తోమారా రాజు అనంగ్‌పాలా

ఢిల్లీలోని అద్బుత ప్రాచీన కట్టడం కుతుబ్ మినార్‌

చిత్రం
Image courtesy: Internet media కుతుబ్ మినార్ ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్రానికి ఒక మచ్చు తునక. ప్రపంచంలోనే ఎత్తయిన ఇటుకల మినార్ (స్తంభం) గా పేరుపొందిన ఈ నిర్మాణం దేశ రాజధాని నగరమైన ఢిల్లీ‌లోని మెహ్రౌలీ ప్రాంతం‌లో గలదు. కుతుబ్ మినార్ ఉన్న ప్రాంతం పురాతన కట్టడాలయిన ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ, కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు, అలై దర్వాజా, అలై మినార్, ఇమాం జామిన్ సమాధి, ఇల్తుమిష్ సమాధి, సుల్తాన్ ఘడి, అల్లావుద్దీన్‌ ఖిల్జీ సమాధి మరియు మదర్సాలతో కూడిన ఇతర నిర్మాణాలన్నింటిని కలిపి “కుతుబ్ కాంప్లెక్స్” అని పిలుస్తారు. 239 అడుగుల పొడవు గల ఈ స్మారక చిహ్నాన్ని నగరంలోని చాలా ప్రాంతాల నుండి చూడవచ్చు. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన సుప్రసిద్ధ ఆకర్షణీయమైన స్మారక కట్టడం విశేషాల గురించి తెలుసుకొందాం. కుతుబ్ మినార్ చరిత్ర: చరిత్ర పుస్తకాల ప్రకారం, ఈ నిర్మాణాన్ని క్రీ.శ. 1192 – 1206 సంవత్సరాల మధ్య కాలం‌లో డిల్లీ పాలించిన కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా, ఆ తరువాత వచ్చిన రాజు ఇల్తుమిష్ పూర్తి చేసాడు. కుతుబుద్దీన్ ఐబక్ మినార్ మొదటి అంతస్తుని కట్టించగా, ఇల్తుమిష్ టవర్ యొక్క మరో మూడు అంతస్తుల