కర్ణాటక రాష్ట్రములోని మాండ్య జిల్లాలో గల శ్రీ రంగపట్టణం లోని శ్రీ రంగనాధ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం మైసూరు నగరానికి అతి సమీపములో ఉన్నది. ఇక్కడ వెలసియున్న శ్రీ రంగనాధ స్వామి వలన ఈ పట్టణానికి శ్రీ రంగపట్టణం అనే పేరు వచ్చింది. దీనినే శ్రీ రంగపట్న లేదా శిరంగ పట్టణ్ అని కూడా అంటారు. ఈ ప్రదేశం చుట్టూ కావేరి నది రెండు పాయలుగా ప్రవహించుట వలన శ్రీ రంగపట్టణం ఒక సుందర ద్వీపంలా కనుపడుతుంది. శ్రీ రంగనాథుడు: పాల సముద్రంలో శేష పానుపుపై పవళించి ఉండే భంగిమలో కనిపించే శ్రీ రంగనాథుడిని శ్రీ మహా విష్ణువు స్వరూపాలలో ఒకటిగా భక్తులు కొలుస్తుంటారు. ఈ క్షేత్రంలో స్వామి వారు కావేరి సమేతంగా దర్శనమిస్తాడు. అయితే ఉత్సవ మూర్తులలో మాత్రం శ్రీ దేవి, భూదేవి అమ్మవార్లు మాత్రమే దర్శనమిస్తారు. కావేరి నదికి శ్రీ రంగనాథునికి ఉన్న సంబంధం విశిష్టమైనది. దేశంలోని ప్రముఖ పంచ రంగ క్షేత్రాలలో మూడు క్షేత్రాలు కావేరి నది ఒడ్డునే వెలసియున్నాయి. అవి కావేరి నది మొదట్లో కర్ణాటకలోని శ్రీరంగపట్నం వెలసిన రంగనాథుడ్ని ఆది రంగ గాను, కర్ణాటక రాష్ఱంలోని శివన సముద్రంలో వెలిసిన రంగనాథుడ్...
Telugu Travel Blog - Travelog తెలుగు ట్రావెల్ బ్లాగ్