పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

న్యూఢిల్లీలోని లోటస్ టెంపుల్

చిత్రం
Photo by Manish Sharma from Pexels లోటస్ టెంపుల్ అనేది భారత రాజధాని నగరమైన న్యూఢిల్లీలోని బహపూర్‌లో గల ప్రఖ్యాత అపురూపమైన ప్రార్ధనా మందిరం. చూడడానికి పెద్ద తామర పువ్వు ఆకారంలో నిర్మితమై ఉండటం వలన ఈ మందిరానికి లోటస్ టెంపుల్ (కమల మందిరం)అనే పేరు వచ్చింది. అధునిక కాలం‌లో మన దేశం‌లోని అద్భుత నిర్మాణాలలో ఒకటిగా పేర్కొనవచ్చు. కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఇక్కడకు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఈ ఆలయం‌ బహాయి మతానికి చెందినది. మానవ జాతి ఏకత్వాన్ని విశ్వసించే బహాయి మత సిద్ధాంతం ప్రకారం దేవుడు నిరాకారుడు. అందువలన ఈ ఆలయం‌లో ప్రత్యేకించి ఏ దేవుడు ఉండడు. ఇక్కడ ఏ మతాన్ని అవలంబించేవారైనా సరే వారి మత గ్రంధాలను వారి బాషలో జపించుకోవచ్చు లేదా చదువుకోవచ్చు కాని వాటిపై ఉపన్యాసాలు ఇవ్వడానికి అనుమతించరు. ప్రత్యేకమైన ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రాంతాన్ని హైదరాబాద్‌కు చెందిన అర్దిషీర్ రుస్తం‌పూర్ (Ardishr Rustampur) విరాళంగా ఇచ్చారు. ఈ నిర్మాణం కోసం తన యావదాస్థిని ఇచ్చారు. ఇరానీ శిల్పకారుడు ఫరీబోజ్‌ సహ్‌బా (Fariborz Sahba) సారధ్యం‌లో ఈ ఆలయ నిర్మాణం ఆరేళ్లపాటు కొనసాగి నవంబర్ 13, 1986 న పూర్తయింది. యు.కె.క

భారత పార్లమెంటు భవనానికి స్పూర్తి అయిన చౌసత్ యోగిని ఆలయం

చిత్రం
పార్లమెంటు భవన్ అనేది భారత దేశం యొక్క అత్యున్నత చట్ట సభ. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన దీనినే పార్లమెంటు హౌస్ లేదా సంసద్ అని పిలుస్తారు. (సంసద్ అంటే సంస్కృతం‌లో ఇల్లు లేక భవనం అని అర్ధం). ఈ భవనం క్రొత్త ఢిల్లీలోని జనపథ్ రోడ్డులో వలయాకార నిర్మాణం‌లో వుండి ప్రధాన ఆకర్షణగా రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌కు కూతవేటు దూరం‌లో కలదు. వృత్తాకారం‌లో నిర్మింపబడిన ఈ బిల్డిం‌‌‌గ్ కాంప్లెక్స్ మధ్యలో 144 స్తం‌భాలతో కూడిన వరండా కలిగిన గోపురం‌తో సెంట్రల్ హాల్ ఎంతో ఠీవిగా నిలుస్తుంది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఇందులో విస్త్రతమైన గ్రంధ సేకరణతో కూడిన ఒక గొప్ప గ్రంధాలయం, వివిధ మంత్రి వర్గ కార్యాలయాలు వాటికి అనుబంధ కార్యాలయములు కొలవై ఉన్నాయి. భారత దేశాన్ని ఈస్టిండియా కంపెని వారు ఢిల్లీ రాజధానిగా పాలించాలని నిర్ణయించాక పరిపాలనా భవనాల నిర్మాణాలను చేపట్టారు. అందుకోసం సర్ ఎడ్డిన్ లూటెన్స్, సర్ హెర్బెర్ట్ అనే ఇద్దరు బ్రిటిష్ ఇంజనీర్లను నియమించారు. వీరిలో సర్ ఎడ్డిన్ లూటెన్స్ మధ్యప్రదేశ్‌‌లోని మతౌలీ అనే మారుమూల ప్రారంభించి ఆరేళ్ల తరువాత జనవరి 18, 1927 న నాటి వైస్రాయ్ లార్