పోస్ట్‌లు

ఏప్రిల్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతీయ అమర సైనికుల స్మృతి చిహ్నం ఇండియా గేట్

చిత్రం
Image courtesy: Asif Methar (www.pexels.com) ఇండియా గేట్ (India Gate) న్యూ ఢిల్లిలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటి. నేను వృత్తి రీత్యా గుర్గావ్‌లో ఉన్నప్పుడు ఇండియా గేట్ దర్శించడం జరిగినది. ఈ పోస్ట్‌‌‌లో ఇండియా గేట్ విశేషాలు తెలుపుతాను. ఇండియా గేట్‌ చరిత్ర: భారతదేశపు రాజధాని నగరం న్యూ ఢిల్లిలోని రాజ్‌పథ్‌లో గల ఈ స్మృతి చిహ్నాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మరియు మూడవ ఆం‌గ్లో ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఆంగ్లేయుల తరపున పోరాడుతూ అసువులు బాసిన 90 వేల మంది భారతీయ అమర జవాన్ల జ్ఞాపకార్థం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం వారు కట్టించారు. బ్రిటీష్ ఇంజనీరు అయిన సర్ ఎడ్విన్ లుటియెన్స్ ఇండియా గేట్‌ స్మారక కట్టడాన్ని రూపకల్పన చేయగా, తేది 10-02-1921 న డ్యూక్ ఆఫ్ కన్నాట్‌ పునాదిరాయి వేసాడు. 10 సంవత్సరాల అనంతరం తేది 12-02-1931 న లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రారంభం‌లో ఈ స్మృతి చిహ్నాన్ని 'ఆలిండియా మెమోరియల్ వార్'గా పిలిచేవారు. ఇండియా గేట్‌ డిజైన్: ఈ కట్టడం పారిస్‌లో గల ‘ఆర్చ్-డీ-ట్రయంఫ్’ (Arc de Triomphe) నిర్మాణ శైలి పోలి ఉంటుంది. భరత్ పూర్ ప్రాంతానికి చెందిన ఎరుపు రంగు గ్రానైట్‌తో ఈ స

ఖాండ్వాలోని దాదా ధునివాలే దర్బార్‌‌

చిత్రం
భారతదేశం ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులకు ప్రసిద్ధి. అటువంటి గురువులలో ఒకరిగా పేరొందిన ధునివాలే దాదాజి యొక్క సమాధి మందిరం వెలసియున్న ‘దాదా ధునివాలే దర్బార్’ దర్శించడానికి మేము ఖాండ్వా పట్టణానికి వెళ్ళాము. ఖాండ్వాకి చేరుటకు మా స్వస్థలం అయిన కావలి నుండి నేరుగా ప్రయాణ మార్గం లేకపోవుట వలన మేము కావలి నుండి నవజీవన్ ఎక్స్‌‌‌ప్రెస్‌‌ ద్వారా మహారాష్ట్రలోని అకోలా జంక్షన్ చేరుకొని, అక్కడ నుంచి మరొక రైలు ద్వారా ఖాండ్వా పట్టణం చేరుకొన్నాము. ఈ బ్లాగ్ పోస్టు ద్వారా ఖాండ్వా విశేషాల గురించి చెపుతాను. ఖాండ్వా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిమార్ ప్రాంతం‌లో ఉన్న ఒక ప్రాచీన మరియు చారిత్రక పట్టణం. ఇది ఖాండ్వా జిల్లా యొక్క పరిపాలనా కేంద్రం. ఖాండ్వా జిల్లాను గతం‌లో తూర్పు నిమార్ జిల్లాగా పిలిచేవారు. ఇక్కడ పలు ప్రాచీన ఆలయాలు మరియు జైన మందిరాలు ఉన్నాయి. 12 వ శతాబ్దం‌లో జైన మతం పట్ల విశ్వాసం పెరగడం వలన ఖాండ్వా జైన మత ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధిచెందింది. 1818 వ సంవత్సరం‌లో ఖండ్వా జిల్లాను మరాఠీ పాలకుల నుండి బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాక బ్రిటీష్ పాలనలో ఖాండ్వా నిమార్ ప్రాంతంలో ప్రధాన వ్యాపార కేంద్రంగా వ

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

చిత్రం
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3