పోస్ట్‌లు

డిసెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మమ్మియూర్ శ్రీ మహదేవ దేవాలయం, గురువాయూర్

చిత్రం
మమ్మియూర్ శివాలయం కేరళ రాష్ట్రం‌లో నెలకొని వున్న ప్రముఖ పుణ్య క్షేత్రం గురువాయూర్ నందు కలదు. ఈ క్షేత్రాన్నే మమ్మియూర్ దేవాలయం లేదా మమ్మియూర్ మహాదేవ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీ గురువాయూరప్పన్ దేవాలయనికి సమీపం‌లో వాయువ్యంగా సుమారు 200 మీటర్ల దూరంలో ఈ మమ్మియూర్ మహాదేవుని ఆలయం కలదు. ఈ ఆలయం‌లో మహా శివుడు ఉమా మహేశ్వరుని రూపంలో పూజించబడుతున్నాడు. ఇక 'గురువు', 'వాయివు' లిద్దరిచే నిర్మితమైన శ్రీ కృష్ణ దేవాలయం గల ఊరు కనుక ‘గురువాయూరు’ అని పిలువబడుతుందని ఐతిహ్యం. గురువాయురప్పన్ వెలసిన ఈ క్షేత్ర భూమికి యజమాని మహా శివుడు. అందువలన గురువాయూరు సందర్శించిన భక్తులు మమ్మీయూర్ నందు వెలిసిన మహాదేవున్ని దర్శించకపోతే గురువాయూరు పర్యటన సఫలం కాదని చెబుతారు. గురువాయురప్పన్ క్షేత్రం గురించి నేను ఇది వరకే వ్రాసిన పోస్ట్ సందర్శించుటకై ఇక్కడ క్లిక్ చేయండి స్థల పురాణం: దేవతల గురువైన బృహస్పతి మరియు వాయు దేవుడు గురువాయురప్పన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు తగిన ప్రదేశం కొరకు వెదుకుచూ పరశురామ క్షేత్రమైన కేరళ తీర ప్రాంతానికి వచ్చెను. అక్కడ మహా శివుడు ఒక సరస్సు ఒడ్డున తపస్సు చేయుచుండగా ఆ