పోస్ట్‌లు

నవంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

చిత్రం
గురువాయూర్ కేరళ రాష్ట్రం‌లో నెలకొని వున్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీ కృష్ణుడు బాల కృష్ణునిగా కొలువుదీరి గురువాయూరప్పన్‌గా పూజలందుకొంటున్నాడు. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రాన్ని భూలోక శ్రీ వైకుంఠం అని, కలియుగ వైకుంఠం అని భక్తులు భావిస్తూ స్వామి వారిని దర్శించి తరిస్తుంటారు. దేవతల గురువైన బృహస్పతి వాయిదేవుని తోడ్పాటుతో ఈ క్షేత్రం‌‌లో విగ్రహ ప్రతిష్టాపన చేయడం వలన, 'గురువు', 'వాయివు' లిద్దరిచే నిర్మితమైన దేవాలయం గల ఊరు కనుక 'గురువాయూర్' లేదా ‘గురువాయూరు’ అని పిలువబడుతుందని ఐతిహ్యం. గురువాయూరు ఆలయ చరిత్ర తెలిపే మురళ్ పెయింట్ గురువాయూర్ విగ్రహ ప్రత్యేకత: గురువాయూర్ ఆలయ గర్బగుడిలోని విగ్రహం అయిదు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడే అపూర్వమైన పాలరాతి అంజన శిలతో (పాతాళ శిల) మలచబడినది. ఈ రాయి చూడటానికి నీలపు రంగులో ఉంటుంది. ఇటువంటి విగ్రహం ప్రపంచం‌లో ఇంకొకటి లేదని చెపుతారు. స్వామి వారు శ్రీ మహా విష్ణువు రూపం‌లో చతుర్భుజములతో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం (గద) మరియు పద్మము ధరించి బాల గోపాలునిగా దర్శనమిస్తారు. ఆలయ ప్రవేశద్వారం గురువాయూర్ స్థల ప

ఉడుపి సమీపంలోని అందమైన ద్వీపాల సమూహం సెయింట్ మేరీస్ ద్వీపం

చిత్రం
సెయింట్ మేరీస్ ద్వీపం ఉడుపి సమీపంలోని మల్పే బీచ్‌కు ఉత్తరాన ఉన్న చిన్న అందమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీపం‌లోని తెల్లని ఇసుక బీచ్‌లు, ఏకరాతి స్ఫటికాకార శిలలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. సాధారణంగా యాత్రికులు ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించిన తరువాత ఉడుపికి దగ్గరలో వున్న ఈ ద్వీపాన్ని సందర్శిస్తుంటారు. ఉడుపి ప్యాకేజీలలో భాగంగా సందర్శించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. అరేబియా సముద్రం‌లోని ఈ ద్వీపం కోకోనెట్ ఐల్యాండ్, నార్త్ ఐల్యాండ్, సౌత్ ఐల్యాండ్ మరియు దర్యాబహదూర్‌గర్ ఐల్యాండ్ అనే నాలుగు ద్వీపాల సమూహం. ఈ ద్వీపం అంతటా చెల్లాచెదురుగా ఉన్న ప్రత్యేకమైన స్ఫటికాకార రాళ్ళు ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రకృతి దృశ్యాన్ని అందిస్తాయి. అగ్ని పర్వతం నుండి వెలువడిన లావా వలన ఇటువంటి రాళ్ళు ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ స్ఫటికాకార శిలలపై నిలబడి సూర్యాస్తమయాన్ని వీక్షించడం ద్వీపంలో అత్యంత ఆకర్షణీయమైన అనుభవాలలో ఒకటి. భౌగోళిక ప్రాముఖ్యత: సుమారు 88 మిలియన్ సంవత్సరాల క్రితం మడగాస్కర్ భారత భూభాగం‌లో కలిసి వుండేవి. కాలక్రమం‌లో మడగాస్కర్ భారత భూభాగం నుంచి వేరుపడిన సమయం‌లో ఈ దీవులు ఏర్పడినట్లు