భారత పార్లమెంటు భవనానికి స్పూర్తి అయిన చౌసత్ యోగిని ఆలయం


పార్లమెంటు భవన్ అనేది భారత దేశం యొక్క అత్యున్నత చట్ట సభ. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన దీనినే పార్లమెంటు హౌస్ లేదా సంసద్ అని పిలుస్తారు. (సంసద్ అంటే సంస్కృతం‌లో ఇల్లు లేక భవనం అని అర్ధం). ఈ భవనం క్రొత్త ఢిల్లీలోని జనపథ్ రోడ్డులో వలయాకార నిర్మాణం‌లో వుండి ప్రధాన ఆకర్షణగా రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌కు కూతవేటు దూరం‌లో కలదు. వృత్తాకారం‌లో నిర్మింపబడిన ఈ బిల్డిం‌‌‌గ్ కాంప్లెక్స్ మధ్యలో 144 స్తం‌భాలతో కూడిన వరండా కలిగిన గోపురం‌తో సెంట్రల్ హాల్ ఎంతో ఠీవిగా నిలుస్తుంది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఇందులో విస్త్రతమైన గ్రంధ సేకరణతో కూడిన ఒక గొప్ప గ్రంధాలయం, వివిధ మంత్రి వర్గ కార్యాలయాలు వాటికి అనుబంధ కార్యాలయములు కొలవై ఉన్నాయి.

భారత దేశాన్ని ఈస్టిండియా కంపెని వారు ఢిల్లీ రాజధానిగా పాలించాలని నిర్ణయించాక పరిపాలనా భవనాల నిర్మాణాలను చేపట్టారు. అందుకోసం సర్ ఎడ్డిన్ లూటెన్స్, సర్ హెర్బెర్ట్ అనే ఇద్దరు బ్రిటిష్ ఇంజనీర్లను నియమించారు. వీరిలో సర్ ఎడ్డిన్ లూటెన్స్ మధ్యప్రదేశ్‌‌లోని మతౌలీ అనే మారుమూల ప్రారంభించి ఆరేళ్ల తరువాత జనవరి 18, 1927 న నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌చే భవన ప్రారంభోత్సవం చేయబడినది. వృత్తాకారం‌లో నిర్మించబడిన ఈ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌‌లో మధ్యన ఉన్న భవనాన్ని నాడు చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌‌‌గా వాడుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత దాన్ని భారత ప్రభుత్వం పార్లమెంటు లైబ్రరీ హాల్‌గా మార్చింది. నాటి స్టేట్ కౌన్సిల్‌ను రాజ్యసభగా, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని లోక్‌సభగా వినియోగిస్తోంది. భారత పార్లమెంటు నిర్మాణానికి స్పూర్తినిచ్చిన చౌసత్ యోగిని ఆలయం గురించి తెలుసుకుందామా?
వృత్తాకారం‌లో నిర్మించబడిన ఈ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌‌లో మధ్యన ఉన్న భవనాన్ని నాడు చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌‌‌గా వాడుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత దాన్ని భారత ప్రభుత్వం పార్లమెంటు లైబ్రరీ హాల్‌గా మార్చింది. నాటి స్టేట్ కౌన్సిల్‌ను రాజ్యసభగా, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని లోక్‌సభగా వినియోగిస్తోంది. భారత పార్లమెం‌‌‌‌‌ట్ నిర్మాణానికి స్పూర్తినిచ్చిన చౌసత్ యోగిని ఆలయం గురించి తెలుసుకుందామా?

చౌసత్ యోగిని ఆలయం:


చౌసత్ యోగిని ఆలయం మధ్యప్రదేశ్‌‌లోని బుం‌‌‌దేల్‌‌ఖం‌డ్ ప్రాంతం‌లో మొరీనా జిల్లాలో కల మతౌలీ అని పిలవబడే మారుమూల గ్రామం‌లో ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 11 వ శతాబ్ధం‌లో దేవపాల్ అని పిలవబడే రాజు పాలనలో నిర్మించినట్లు చెపుతారు. ఈ అలయాన్నే ఏకత్తార్సో మహదేవ ఆలయం అని కూడా పిలుస్తారు.

సుమారు 100 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఉన్న ఈ ఆలయం వలయాకారంలో 170 అడుగుల (52 మీ) వ్యాసార్థంతో ఉంటుంది. దాని లోపలి భాగంలో 64 చిన్న గదులులలో ప్రతి మండపం‌‌లో 64 యోగిని విగ్రహాలు ఉన్నాయి, చౌసత్ అంటే అరవై నాలుగు అందుకే చౌసత్ యోగిని దేవాలయం అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణం‌తో వేరుచేయబడి మధ్యలో కల గర్బ మండపం‌లో ప్రధాన దైవమైన శివుడు ఏక లింగ రూపం‌‌లో నెలకొని ఏకాటేశ్వరునిగా పిలువబడుతున్నాడు.

చౌసత్ యోగిని ఆలయం‌‌కు ఎలా వెళ్ళాలి?

మధ్యప్రదేశ్‌‌లోని చౌసత్ యోగిని ఆలయం‌‌ నెలకొని ఉన్న మతౌలీ గ్రామంకు విమాన, రైల్ మరియు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మతౌలీ దగ్గరలో ఉన్న నగరం గ్వాలియర్.

పార్లమెంటు హౌస్‌‌‌కు ఎలా వెళ్ళాలి?

ఢిల్లీలోని జనపథ్ రోడ్డులో గల పార్లమెంటు హౌస్‌‌‌కు టాక్సీలు, ఆటోలు, ఆన్‌లైన్ క్యాబ్ మరియు మెట్రో రైలు ద్వారా చేరుకోవచ్చు.

మెట్రో స్టేషన్:
సమీప మెట్రో రైలు Central Secretariat కలదు. ఇక్కడి నుండి నడక ద్వారా లేదా ఆటో ద్వారా చేరుకోవచ్చు,
బస్ స్టేషన్:
పార్లమెంటు చేరుకోవడానికి బస్ సదుపాయం లేదు. పార్లమెంటు చేరుకోవడానికి బస్ సదుపాయం లేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం