సెయింట్ ఫిలోమినా చర్చి




మైసూరు నగరంలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో సెయింట్ ఫిలోమినా చర్చి ఒకటి. దీనినే సెయింట్ జోసెఫ్ చర్చి అని కూడా అంటారు. ఈ చర్చి ఆసియాలోనే రెండవ అతి పొడవైన చర్చిగా గుర్తింపు ఉంది. ఈ చర్చిని కాథలిక్ సెయింట్, రోమన్ కాథలిక్ చర్చి మార్టిర్ అయిన సెయిం‌ట్ ఫిలోమినా గౌరవార్ధం మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ నిర్మించారు.


టిప్పు సుల్తాన్ అనంతరం మైసూరు రాజ్యానికి రాజధానిగా శ్రీరంగపట్నం నుండి మైసూరు నగరానికి మార్చబడినది. అప్పుడు అనేక బ్రిటీష్ అధికారులు మరియు సైనికులు వచ్చి మైసూరులో స్థిరపడినారు. అప్పటి మహారాజా కృష్ణరాజ వడయార్ III ఈ వ్యక్తుల కోసం ఒక క్రైస్తవ చర్చి అవసరాన్ని గుర్తించి, 1843 సంవత్సరంలో నిర్మించినారు. కాలక్రమం‌లో నగరం విస్తరించడం మరియు నగరంలో క్రిస్టియన్ జనాభా పెరుగుతుండగా ప్రస్తుత రూపంలో ఉన్న ఈ చర్చిని 1933 సంవత్సరంలో మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ IV తన తాత నిర్మించిన చిన్న చర్చి స్థానంలో పునర్నిర్మించారు.

ఈ చర్చి గోతిక్ శైలిలో జర్మనీలోని కొలోన్ కెథడ్రల్ చర్చి ప్రేరణతో నిర్మించబడింది. దీనిలోని నిర్మాణాలు పురాతన శైలి కలిగి ఉండి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి. చర్చి టవర్లు న్యూయార్క్‌లోని సెయింట్ పాట్రిక్స్ చర్చిని ప్రతిబింబిస్తాయి. చర్చి టవర్లు 175 అడుగుల పొడవుగా ఉండి, చర్చి గొప్పతనాన్ని చాటుతుంటాయి. పర్యాటకులు సెయింట్ ఫిలోమినా మరియు హోలీ క్రిస్ట్ ల విగ్రహాలు చూడవచ్చు. చర్చిలోపల ఇంటీరియల్ గాజు పై క్రీస్తు పుట్టుక, శిలువ వేయు చిత్రాలు మరియు పునరుత్థానాన్ని చూడవచ్చు. అలాగే పాలరాతితో చేయబడిన సెయింట్ ఫిలోమినా విగ్రహం ఉంది. ప్రతిరోజు ఉదయం మరియు సాయింత్రం వేళలలో కన్నడ, తమిళం మరియు ఇంగ్లీష్ బాషలలో హోలి మాస్ నిర్వహిస్తారు.


ఎలా వెళ్ళాలి?

రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలచే ఈ నగరం అనుసంధానించబడి ఉన్నది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం