ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఢిల్లీలోని ప్రసిద్ధి ఎర్ర కోట

Image by Shouvik Raychowdhury from Pixabay ఎర్ర కోట లేదా లాల్ ఖిలా అనే కట్టడం పాత ఢిల్లీలోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో అతి పెద్ద చారిత్రక నిర్మాణం. ఈ కోటను ఎర్రని ఇసుకరాయి ఉపయోగించి నిర్మించడం వలన ఎరుపు రంగులో ఉండి, ఎర్ర కోటగా ప్రసిద్ధిచెందింది. ప్రతి ఏడాది మన దేశం స్వాతంత్ర్యం పొందిన రోజైన ఆగస్టు 15 వ తేదీన భారత ప్రధానమంత్రి మువ్వన్నెల జెండాని ఎగరవేసి తదుపరి దేశానుద్దేశించి ఇక్కడి నుండే ప్రసంగిస్తారు. ఈ ఎర్ర కోట 2007 వ సంవత్సరములో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా UNESCO సంస్థ వారిచే ప్రకటించబడింది. 1649 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఎర్ర కోటను నిర్మించగా, ఎర్ర కోట కేంద్రం‌గా ఢిల్లీ నగరం ఏడు సార్లు నిర్మితమైంది. మొఘల్ సామ్రాజ్య వైభవానికి, పతనానికి ఈ కోట సాక్షీభూతం‌గా నిలిచింది. ఆగస్టు 15, 1947 న భారతదేశ స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ మన జాతీయ పతాకాన్ని ఇక్కడే ఎగురవేసి ప్రసంగించారు. నాటి నుం‌‌‌చి ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇదే సంప్రదాయం ఈనాటికీ కొనసాగుతూ ఉంది. ఎర్ర కోట చరిత్ర: ఈ కోటను మొదటిసారిగా తోమారా రాజు అనంగ్‌పాలా...

ఢిల్లీలోని అద్బుత ప్రాచీన కట్టడం కుతుబ్ మినార్‌

Image courtesy: Internet media కుతుబ్ మినార్ ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్రానికి ఒక మచ్చు తునక. ప్రపంచంలోనే ఎత్తయిన ఇటుకల మినార్ (స్తంభం) గా పేరుపొందిన ఈ నిర్మాణం దేశ రాజధాని నగరమైన ఢిల్లీ‌లోని మెహ్రౌలీ ప్రాంతం‌లో గలదు. కుతుబ్ మినార్ ఉన్న ప్రాంతం పురాతన కట్టడాలయిన ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ, కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు, అలై దర్వాజా, అలై మినార్, ఇమాం జామిన్ సమాధి, ఇల్తుమిష్ సమాధి, సుల్తాన్ ఘడి, అల్లావుద్దీన్‌ ఖిల్జీ సమాధి మరియు మదర్సాలతో కూడిన ఇతర నిర్మాణాలన్నింటిని కలిపి “కుతుబ్ కాంప్లెక్స్” అని పిలుస్తారు. 239 అడుగుల పొడవు గల ఈ స్మారక చిహ్నాన్ని నగరంలోని చాలా ప్రాంతాల నుండి చూడవచ్చు. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన సుప్రసిద్ధ ఆకర్షణీయమైన స్మారక కట్టడం విశేషాల గురించి తెలుసుకొందాం. కుతుబ్ మినార్ చరిత్ర: చరిత్ర పుస్తకాల ప్రకారం, ఈ నిర్మాణాన్ని క్రీ.శ. 1192 – 1206 సంవత్సరాల మధ్య కాలం‌లో డిల్లీ పాలించిన కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా, ఆ తరువాత వచ్చిన రాజు ఇల్తుమిష్ పూర్తి చేసాడు. కుతుబుద్దీన్ ఐబక్ మినార్ మొదటి అంతస్తుని కట్టించగా, ఇల్తుమిష్ టవర్ యొక్క మరో మూడు అంతస్తుల...

భారతీయ అమర సైనికుల స్మృతి చిహ్నం ఇండియా గేట్

Image courtesy: Asif Methar (www.pexels.com) ఇండియా గేట్ (India Gate) న్యూ ఢిల్లిలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటి. నేను వృత్తి రీత్యా గుర్గావ్‌లో ఉన్నప్పుడు ఇండియా గేట్ దర్శించడం జరిగినది. ఈ పోస్ట్‌‌‌లో ఇండియా గేట్ విశేషాలు తెలుపుతాను. ఇండియా గేట్‌ చరిత్ర: భారతదేశపు రాజధాని నగరం న్యూ ఢిల్లిలోని రాజ్‌పథ్‌లో గల ఈ స్మృతి చిహ్నాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మరియు మూడవ ఆం‌గ్లో ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఆంగ్లేయుల తరపున పోరాడుతూ అసువులు బాసిన 90 వేల మంది భారతీయ అమర జవాన్ల జ్ఞాపకార్థం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం వారు కట్టించారు. బ్రిటీష్ ఇంజనీరు అయిన సర్ ఎడ్విన్ లుటియెన్స్ ఇండియా గేట్‌ స్మారక కట్టడాన్ని రూపకల్పన చేయగా, తేది 10-02-1921 న డ్యూక్ ఆఫ్ కన్నాట్‌ పునాదిరాయి వేసాడు. 10 సంవత్సరాల అనంతరం తేది 12-02-1931 న లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రారంభం‌లో ఈ స్మృతి చిహ్నాన్ని 'ఆలిండియా మెమోరియల్ వార్'గా పిలిచేవారు. ఇండియా గేట్‌ డిజైన్: ఈ కట్టడం పారిస్‌లో గల ‘ఆర్చ్-డీ-ట్రయంఫ్’ (Arc de Triomphe) నిర్మాణ శైలి పోలి ఉంటుంది. భరత్ పూర్ ప్రాంతానికి చెందిన ఎరుపు రంగు గ్రానైట్‌తో ఈ స...

ఖాండ్వాలోని దాదా ధునివాలే దర్బార్‌‌

భారతదేశం ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులకు ప్రసిద్ధి. అటువంటి గురువులలో ఒకరిగా పేరొందిన ధునివాలే దాదాజి యొక్క సమాధి మందిరం వెలసియున్న ‘దాదా ధునివాలే దర్బార్’ దర్శించడానికి మేము ఖాండ్వా పట్టణానికి వెళ్ళాము. ఖాండ్వాకి చేరుటకు మా స్వస్థలం అయిన కావలి నుండి నేరుగా ప్రయాణ మార్గం లేకపోవుట వలన మేము కావలి నుండి నవజీవన్ ఎక్స్‌‌‌ప్రెస్‌‌ ద్వారా మహారాష్ట్రలోని అకోలా జంక్షన్ చేరుకొని, అక్కడ నుంచి మరొక రైలు ద్వారా ఖాండ్వా పట్టణం చేరుకొన్నాము. ఈ బ్లాగ్ పోస్టు ద్వారా ఖాండ్వా విశేషాల గురించి చెపుతాను. ఖాండ్వా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిమార్ ప్రాంతం‌లో ఉన్న ఒక ప్రాచీన మరియు చారిత్రక పట్టణం. ఇది ఖాండ్వా జిల్లా యొక్క పరిపాలనా కేంద్రం. ఖాండ్వా జిల్లాను గతం‌లో తూర్పు నిమార్ జిల్లాగా పిలిచేవారు. ఇక్కడ పలు ప్రాచీన ఆలయాలు మరియు జైన మందిరాలు ఉన్నాయి. 12 వ శతాబ్దం‌లో జైన మతం పట్ల విశ్వాసం పెరగడం వలన ఖాండ్వా జైన మత ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధిచెందింది. 1818 వ సంవత్సరం‌లో ఖండ్వా జిల్లాను మరాఠీ పాలకుల నుండి బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాక బ్రిటీష్ పాలనలో ఖాండ్వా నిమార్ ప్రాంతంలో ప్రధాన వ్యాపార కేంద్రంగా వ...

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

బాబా నడయాడిన షిరిడి క్షేత్రం

షిరిడి (షిర్డీ) మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం. సాయి బాబా నడయాడిన షిరిడిని జీవితం‌లో ఒక్కసారైనా దర్శించాలని ఆయన భక్తులు ఆకాంక్షిస్తారు. ఇక్కడి నెలకొని ఉన్న శ్రీ సాయి బాబా మందిర్‌ను దర్శించడానికి దేశం‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. సాయి బాబా అసలు పేరు, జన్మ స్థలం, తల్లిదండ్రులు గురించి తెలియదు. కొన్ని అధ్యయనాల ప్రకారం శ్రీ సాయి బాబా తన 16వ వయస్సులో షిరిడికి వచ్చి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి తరువాత కొంత కాలం కనిపించలేదని ఆయన భక్తులు భావిస్తారు. ఆ కనుపించని సమయం‌లో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. పిదప కొంత కాలానికి ఔరంగాబాద్ జిల్లా ధూప్ ఖేడా గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే వ్యక్తి తన బావమరిది కొడుకు పెళ్ళి కోసం ఎడ్లబండిలో షిరిడీ వెళుతుండగా వారితో పాటు కలిసి షిరిడి వచ్చారని భావిస్తారు. ఆయన షిరిడి వచ్చినప్పుడు ఖండోబా ఆలయ సమీపంలో ఆలయ పూజారి మహల్సాపతి “ఆవో సాయీ” (తెలుగులో రండి సాయీ అని అర్ధం) అని పిలిచారు. ఆ విధంగా “సాయి” అనే పేరు స్థిరపడి ఆయన “షిరిడి సాయి బాబా”గా ప్రసిద్ధుడైనాడు. షిరిడీలో ఒక పాత మసీదులో నివసించేవాడు. ఈ మసీదునే “ద్వారక...

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

అరుణాచలేశ్వరుడు నెలకొనివున్న అరుణాచలం ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రము. దీనినే తమిళులు ‘అణ్ణామలై’ లేదా ‘తిరువణ్ణామలై’ అంటారు. తిరువణ్ణామలై తమిళనాడు రాష్టంలో ఉన్న తిరువణ్ణామలై జిల్లాలో వెలసి ఉంది. ఇది శైవులకు ఎంతో ముఖ్యమైన క్షేత్రము. తిరువణ్ణామలై పంచ భూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం పంచలింగ క్షేత్రములలో అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు తమిళనాడులోని చిదంబరం క్షేత్రం ఆకాశమును, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తి క్షేత్రం వాయువును, తమిళనాడులోని తిరువనైకోవిల్ క్షేత్రం నీటిని మరియు తమిళనాడులోని కంచి క్షేత్రం భూమిని సూచిస్తాయి. స్థల పురాణం: పూర్వం బ్రహ్మ విష్ణువుల మద్య జరిగిన తగువును తీర్చడానికి మహా శివుడు వారిద్దరి మద్య అగ్ని లింగంగా ఆవిర్భవించాడు. అప్పుడు ఉద్బవించిన ప్రకాశవంతమైన కాంతిని చూడలేక బ్రహ్మ విష్ణువులతో పాటు సకల దేవతలు ప్రార్ధించగా మహా శివుడు ఎర్రని శిల (కొండ) రూపం‌లో సాక్షాత్కరించాడు అదే అరుణాచలముగా పిలవబడుతుంది. అరుణ అనగా ఎర్రని, అచలము అనగా కొండ అని అర్ధము. ఎర్రని అరుణ రూపం‌లో వెలసిన పర్వతం కనుక అరుణాచలంగా ప్రసిద్ధిచెందింది. అలాగే 'అణ్ణాల్‌...