ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

బాబా నడయాడిన షిరిడి క్షేత్రం

షిరిడి (షిర్డీ) మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం. సాయి బాబా నడయాడిన షిరిడిని జీవితం‌లో ఒక్కసారైనా దర్శించాలని ఆయన భక్తులు ఆకాంక్షిస్తారు. ఇక్కడి నెలకొని ఉన్న శ్రీ సాయి బాబా మందిర్‌ను దర్శించడానికి దేశం‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. సాయి బాబా అసలు పేరు, జన్మ స్థలం, తల్లిదండ్రులు గురించి తెలియదు. కొన్ని అధ్యయనాల ప్రకారం శ్రీ సాయి బాబా తన 16వ వయస్సులో షిరిడికి వచ్చి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి తరువాత కొంత కాలం కనిపించలేదని ఆయన భక్తులు భావిస్తారు. ఆ కనుపించని సమయం‌లో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. పిదప కొంత కాలానికి ఔరంగాబాద్ జిల్లా ధూప్ ఖేడా గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే వ్యక్తి తన బావమరిది కొడుకు పెళ్ళి కోసం ఎడ్లబండిలో షిరిడీ వెళుతుండగా వారితో పాటు కలిసి షిరిడి వచ్చారని భావిస్తారు. ఆయన షిరిడి వచ్చినప్పుడు ఖండోబా ఆలయ సమీపంలో ఆలయ పూజారి మహల్సాపతి “ఆవో సాయీ” (తెలుగులో రండి సాయీ అని అర్ధం) అని పిలిచారు. ఆ విధంగా “సాయి” అనే పేరు స్థిరపడి ఆయన “షిరిడి సాయి బాబా”గా ప్రసిద్ధుడైనాడు. షిరిడీలో ఒక పాత మసీదులో నివసించేవాడు. ఈ మసీదునే “ద్వారక...

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

అరుణాచలేశ్వరుడు నెలకొనివున్న అరుణాచలం ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రము. దీనినే తమిళులు ‘అణ్ణామలై’ లేదా ‘తిరువణ్ణామలై’ అంటారు. తిరువణ్ణామలై తమిళనాడు రాష్టంలో ఉన్న తిరువణ్ణామలై జిల్లాలో వెలసి ఉంది. ఇది శైవులకు ఎంతో ముఖ్యమైన క్షేత్రము. తిరువణ్ణామలై పంచ భూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం పంచలింగ క్షేత్రములలో అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు తమిళనాడులోని చిదంబరం క్షేత్రం ఆకాశమును, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తి క్షేత్రం వాయువును, తమిళనాడులోని తిరువనైకోవిల్ క్షేత్రం నీటిని మరియు తమిళనాడులోని కంచి క్షేత్రం భూమిని సూచిస్తాయి. స్థల పురాణం: పూర్వం బ్రహ్మ విష్ణువుల మద్య జరిగిన తగువును తీర్చడానికి మహా శివుడు వారిద్దరి మద్య అగ్ని లింగంగా ఆవిర్భవించాడు. అప్పుడు ఉద్బవించిన ప్రకాశవంతమైన కాంతిని చూడలేక బ్రహ్మ విష్ణువులతో పాటు సకల దేవతలు ప్రార్ధించగా మహా శివుడు ఎర్రని శిల (కొండ) రూపం‌లో సాక్షాత్కరించాడు అదే అరుణాచలముగా పిలవబడుతుంది. అరుణ అనగా ఎర్రని, అచలము అనగా కొండ అని అర్ధము. ఎర్రని అరుణ రూపం‌లో వెలసిన పర్వతం కనుక అరుణాచలంగా ప్రసిద్ధిచెందింది. అలాగే 'అణ్ణాల్‌...

మైసూరులో నెలకొనివున్న శ్రీ చాముండేశ్వరీ ఆలయం

శ్రీ చాముండేశ్వరీ ఆలయం కర్ణాటక రాష్ట్రం‌లోని ప్రధాన నగరాలలో ఒకటైన మైసూరు నగరానికి తూర్పున సుమారు 12 కి.మి.ల దూరం‌లో గల చాముండీ పర్వతం‌పై నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. ఈ నగరాన్నే క్రౌంచపురి, క్రౌంచ పట్టణం, క్రౌంచ పీఠంగా పిలుస్తుంటారు. పురాణ ప్రాశస్థం: పూర్వం మహిషపురిగా పిలవబడే ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించేవాడు. ఈ రాక్షసుడు పరమశివుడిని తన కఠోర తపస్సుతో మెప్పించి, లోకం‌లోని ఏ పురుషుడి చేతిలో మరణించకుండా వుండేలా వరం పొందాడు. మహిషాసురుడుని వధించుటకై శ్రీ చాముండేశ్వరీ దేవి శక్తి స్వరూపిణిగా అవతరించి, మహిషాసురుని సంహరించి మహిషాసురమర్ధినిగా ప్రసిద్ధమైనది. శక్తి పీఠం: హిందూ పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం సమయం‌లో సతీ దేవి ప్రాణ త్యాగం చేసినప్పుడు, పరమ శివుడు ఆమె శరీరాన్ని తన భుజాన వేసుకొని రుద్రతాండవం చేశాడు. ఆ సమయం‌లో విష్ణు దేవుడు తన చక్రం‌తో ఆమె శరీరాన్ని ఖండించగా, ఆ శరీర బాగాలు దేశం‌లోని పద్దెనిమిది ప్రాంతాలలో పడి ఆ ప్రాంతాలు అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్దిగాంచాయి. వాటిలో నాల్గవ శక్తి పీఠమే శ్రీ చాముండేశ్వరీ క్షేత్రం. ఈ పీఠం‌పై...

మైసూరు రాజ కుటుంబీకుల ఉద్యానవనం: బృందావన గార్డెన్స్

పర్యాటకులకు గమ్యస్థానం అయినటువంటి మైసూరు నగరం‌లో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మైసూరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావన గార్డెన్స్‌ను మైసూరుకు వచ్చే పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రాంతాలలో ఒకటి. మైసూరును చూడటానికి వచ్చే యాత్రికులు నగరానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ (KRS డ్యామ్) తీరాన ఉన్న ఈ ఉద్యానవనం విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉద్యానవనాన్ని సందర్శించటానికి ప్రతి సంవత్సరము సుమారు ఇరవై లక్షలు పైగా యాత్రికులు వస్తుంటారని అంచనా. ఒకప్పుడు కృష్ణ రాజేంద్ర టెర్రస్ గార్డెన్స్ అని పిలిచే ఈ అందమైన ఉద్యనవనాన్ని కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ దిగువున కృష్ణరాజ వడయార్‌చే 1927 సంవత్సరంలో ప్రారంభించబడి 1932 వ సంవత్సరం‌లో పూర్తిచేయబడినది. కృష్ణ రాజ సాగర్ డ్యాంను భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యం‌లో కృష్ణరాజ వడయార్‌ - IV పేరు మీదుగా నిర్మించగా, డ్యాం క్రింది ప్రాంతం‌లో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో కల ఈ ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ సారధ్యం‌లో కట్టించెను. ప్రకృతి ప్రేమికులు బృందావనంలోని అందమైన మొక్కలు, పచ్చిక బయళ...

సెయింట్ ఫిలోమినా చర్చి

మైసూరు నగరంలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో సెయింట్ ఫిలోమినా చర్చి ఒకటి. దీనినే సెయింట్ జోసెఫ్ చర్చి అని కూడా అంటారు. ఈ చర్చి ఆసియాలోనే రెండవ అతి పొడవైన చర్చిగా గుర్తింపు ఉంది. ఈ చర్చిని కాథలిక్ సెయింట్, రోమన్ కాథలిక్ చర్చి మార్టిర్ అయిన సెయిం‌ట్ ఫిలోమినా గౌరవార్ధం మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ నిర్మించారు. టిప్పు సుల్తాన్ అనంతరం మైసూరు రాజ్యానికి రాజధానిగా శ్రీరంగపట్నం నుండి మైసూరు నగరానికి మార్చబడినది. అప్పుడు అనేక బ్రిటీష్ అధికారులు మరియు సైనికులు వచ్చి మైసూరులో స్థిరపడినారు. అప్పటి మహారాజా కృష్ణరాజ వడయార్ III ఈ వ్యక్తుల కోసం ఒక క్రైస్తవ చర్చి అవసరాన్ని గుర్తించి, 1843 సంవత్సరంలో నిర్మించినారు. కాలక్రమం‌లో నగరం విస్తరించడం మరియు నగరంలో క్రిస్టియన్ జనాభా పెరుగుతుండగా ప్రస్తుత రూపంలో ఉన్న ఈ చర్చిని 1933 సంవత్సరంలో మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ IV తన తాత నిర్మించిన చిన్న చర్చి స్థానంలో పునర్నిర్మించారు. ఈ చర్చి గోతిక్ శైలిలో జర్మనీలోని కొలోన్ కెథడ్రల్ చర్చి ప్రేరణతో నిర్మించబడింది. దీనిలోని నిర్మాణాలు పురాతన శైలి కలిగి ఉండి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి. చ...

మైసూరు మహారాజుల రాజ సౌధం అంబా విలాస్ ప్యాలెస్

రాజభవనాల నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూరును సందర్శించే పర్యాటకులు తప్పక చూడవలసిన 7 రాజభవనాల్లో అంబా విలాస్ ప్యాలెస్ ఒకటి. దీనినే ‘మైసూరు ప్యాలెస్’ లేదా ‘మైసూరు మహారాజా ప్యాలెస్’ అని కూడా పిలుస్తుంటారు. మైసూరు మహారాజ కుటుంబీకుల కొరకు ఈ ప్యాలెస్ భవనాన్ని నిర్మించారు. 14 వ శతాబ్దం‌లో నిర్మింపబడిన ఈ భవనం అనేక పర్యాయాలు పునర్మించి ప్రస్తుత ప్యాలెస్ భవనాన్ని నిర్మిచారు. బ్రిటీష్ ఆర్కిటెక్ అయిన హెర్నీ ఇర్విన్‌ సారధ్యం‌లో ఇండో సార్సెనిక్, ద్రవిడ, మొగలుల, రోమన్, మరియు ప్రాచ్య దేశాల నిర్మాణాల శైలిలో 1897 – 1912 సంవత్సరాల మధ్య నిర్మించబడినది. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ 41,47,913/- వ్యయం అయ్యింది. 1912 సంవత్సరములో ప్యాలెస్ నిర్మాణం పూర్తయినప్పటికి, తదనంతర కాలం‌లో ప్యాలెస్ ఆధునీకరణ పనులు జరిగాయి. ఈ ఆధునీకరణ పనులలోనే ప్రజా దర్బార్ నిర్మించారు. ప్యాలెస్ భవనం తూర్పు దిక్కు అభిముఖంగా ఉంటుంది. రాజ భవనం‌లోనికి ప్రవేశించడానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ప్రవేశ ద్వారాన్ని ‘జయ మార్తాం‌‌డ ద్వారం’ అని, ఉత్తర ప్రవేశ ద్వారాన్ని ‘జయరామ ద్వారం’ అని, దక్షిణ ప్రవేశ ద్వారాన్ని ‘బల...

రాజప్రాసాదాల నగరం మైసూరు

మైసూరు ప్యాలెస్ మైసూరు నగరాన్ని కర్ణాటక రాష్టానికి సాంస్కృతిక రాజధానిగా పేర్కొంటారు. ఈ నగరములో రాజరిక వారసత్వాన్ని ప్రతిబింబించే పెద్ద రాజ భవనాలు, విశాలమైన రోడ్లు, మ్యూజియంలు, సరస్సులు, ప్రఖ్యాత పట్టు చీరలు, యోగా కేంద్రాలు, చందనం తోటలు వంటి ఎన్నో ప్రత్యేకతలు సందర్శకులకు ఎప్పటికి మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. పర్యాటకులు ఈ నగరాన్నే ‘ఐవరీ సిటీ’ లేదా ‘రాజప్రాసాదాల నగరం’ అని పిలుస్తుంటారు. ఇక్కడి గంధపు ఉత్పత్తులు ఈ నగరాన్ని ‘శాండల్ ఉడ్ సిటి’ అని పేరు తెచ్చిపెట్టాయి. మైసూరు నగరంలో యోగా కేంద్రాలు అధికంగా కనపడే కారణంగా దీనిని ‘యోగా సిటి’ అని కూడా పిలుస్తుంటారు. పురాణ ప్రాశస్థం: మహిషాసురుని విగ్రహం ముందు భారతీయ ఇతిహాసాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించేవాడు. అతని పేరుతోనే ఈ ప్రాంతానికి ‘మహిష - ఊరు’ అని నామకరణం చేయబడింది. కాలక్రమేణా అది ‘మహిషూరు’గా రూపొంది, ఆంగ్లేయుల రాకతో అది “మైసూరు”గా స్ధిరపడింది. ఈ రాక్షసుడుని ఇక్కడి ప్రాంత ప్రజలు కొలిచే చాముండి దేవి సంహరించినట్లు చెపుతారు. నేటి మైసూరు నగరానికి తూర్పున ఉన్న కొండపై చాముండేశ్వరీ దేవాలయం నెలకొని ఉంటుంది. ...