వడక్కునాథన్ దేవాలయం (Vadakkunnathan Temple) కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. కైలాస అధిపతి అయిన మహా శివుడు, ఈ దేవాలయంలో "వడక్కు నాథర్"గా పూజలందుకుంటున్నారు. "వడ" అనగా ఉత్తర ప్రాంతం, "నాథర్" అంటే అధిపతి అని స్థానిక భాషలో అర్థం. వడక్కునాథన్ దేవాలయం కేరళలోనే కాక, భారతదేశంలోనూ అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. త్రిసూర్ నగరం "దక్షిణ కైలాసం"గా ప్రసిద్ధి పొందింది. 2017 సంవత్సరంలో యునెస్కో ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. వడక్కునాథన్ ఆలయ స్థల పురాణం: వడక్కునాథన్ ఆలయ పూర్వకథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. పురాణ కథనం ప్రకారం, పరశురాముడు క్షత్రియులను తుదముట్టించిన తర్వాత తన పాప ప్రక్షాళన కోసం యజ్ఞం చేసి, తన భూమిని బ్రాహ్మణులకు దానం చేశాడు. తపస్సు చేయటానికి తగిన భూమి కోసం వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు, గొడ్డలిని సముద్రంలో విసిరితే విసిరినంత మేరకు భూమి లభిస్తుందని చెప్పాడు. పరశురాముడు గొడ్డలిని విసిరాడు, సముద్రం వెనక్కి వెళ్లి కొంత భూమిని ప్రసాదించింది. ఈ భూమి కేరళగా ప్రసిద్ధి చెందింది. ...
గురువాయూర్ క్షేత్రానికి సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలలో చావక్కాడ్ (చవక్కాడ్) బీచ్ ఒకటి. సుందమైన ఈ బీచ్ గురువాయూర్ పట్టణానికి సుమారు 5 కిమీల దూరంలో ఉన్న చావక్కాడ్ (Chavakkad) పట్టణానికి 2 కిమీల దూరంలో ఉన్నది. ఇక్కడ సమృద్ధిగా పెరిగే చేవల్ చెట్ల వలన ఈ ప్రాంతానికి చావక్కాడ్ అని పేరు వచ్చిందని స్ఠానికులు చెపుతారు. కూట్టుంగళ్ లేదా కూట్టుంగళంగడిగా పిలువబడే ఈ ప్రాంతం పూర్వ యుగంలో వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆంగ్లేయులు ఈ పట్టణాన్ని ‘చౌఘాట్’ అని పిలిచేవారు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం వారు 1970ల ప్రారంభంలో చావక్కాడ్ పేరు మార్చినారు. చావక్కాడ్ బీచ్ 'అజిమోకం' (Azhimukham) అని పిలువబడే దృశ్యానికి ప్రసిద్ధి చెందింది. మలయాళంలో అజిమోకం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశం అని అర్థం. అరేబియా సముద్రపు తీరంలో జాతీయ రహదారి ప్రక్కనే గల ఈ బీచ్ కేరళలోని ఇతర బీచ్‌లతో పోలిస్తే రద్దీ తక్కువ. ఆధునీకరణ స్పృశించని ఈ బీచ్ చుట్టూ ఏపుగా పెరిగిన తాటి చెట్లతో ఎంతో ఆహ్లాదకరపు అనుభవం కలిగిస్తుంది. బీచ్‌లో మృదువైన ఇసుకతో ఎంతో పరిశుభ్రతగా ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను విశేషంగా...