ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెయింట్ ఫిలోమినా చర్చి

మైసూరు నగరంలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో సెయింట్ ఫిలోమినా చర్చి ఒకటి. దీనినే సెయింట్ జోసెఫ్ చర్చి అని కూడా అంటారు. ఈ చర్చి ఆసియాలోనే రెండవ అతి పొడవైన చర్చిగా గుర్తింపు ఉంది. ఈ చర్చిని కాథలిక్ సెయింట్, రోమన్ కాథలిక్ చర్చి మార్టిర్ అయిన సెయిం‌ట్ ఫిలోమినా గౌరవార్ధం మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ నిర్మించారు. టిప్పు సుల్తాన్ అనంతరం మైసూరు రాజ్యానికి రాజధానిగా శ్రీరంగపట్నం నుండి మైసూరు నగరానికి మార్చబడినది. అప్పుడు అనేక బ్రిటీష్ అధికారులు మరియు సైనికులు వచ్చి మైసూరులో స్థిరపడినారు. అప్పటి మహారాజా కృష్ణరాజ వడయార్ III ఈ వ్యక్తుల కోసం ఒక క్రైస్తవ చర్చి అవసరాన్ని గుర్తించి, 1843 సంవత్సరంలో నిర్మించినారు. కాలక్రమం‌లో నగరం విస్తరించడం మరియు నగరంలో క్రిస్టియన్ జనాభా పెరుగుతుండగా ప్రస్తుత రూపంలో ఉన్న ఈ చర్చిని 1933 సంవత్సరంలో మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ IV తన తాత నిర్మించిన చిన్న చర్చి స్థానంలో పునర్నిర్మించారు. ఈ చర్చి గోతిక్ శైలిలో జర్మనీలోని కొలోన్ కెథడ్రల్ చర్చి ప్రేరణతో నిర్మించబడింది. దీనిలోని నిర్మాణాలు పురాతన శైలి కలిగి ఉండి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి. చ...

మైసూరు మహారాజుల రాజ సౌధం అంబా విలాస్ ప్యాలెస్

రాజభవనాల నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూరును సందర్శించే పర్యాటకులు తప్పక చూడవలసిన 7 రాజభవనాల్లో అంబా విలాస్ ప్యాలెస్ ఒకటి. దీనినే ‘మైసూరు ప్యాలెస్’ లేదా ‘మైసూరు మహారాజా ప్యాలెస్’ అని కూడా పిలుస్తుంటారు. మైసూరు మహారాజ కుటుంబీకుల కొరకు ఈ ప్యాలెస్ భవనాన్ని నిర్మించారు. 14 వ శతాబ్దం‌లో నిర్మింపబడిన ఈ భవనం అనేక పర్యాయాలు పునర్మించి ప్రస్తుత ప్యాలెస్ భవనాన్ని నిర్మిచారు. బ్రిటీష్ ఆర్కిటెక్ అయిన హెర్నీ ఇర్విన్‌ సారధ్యం‌లో ఇండో సార్సెనిక్, ద్రవిడ, మొగలుల, రోమన్, మరియు ప్రాచ్య దేశాల నిర్మాణాల శైలిలో 1897 – 1912 సంవత్సరాల మధ్య నిర్మించబడినది. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ 41,47,913/- వ్యయం అయ్యింది. 1912 సంవత్సరములో ప్యాలెస్ నిర్మాణం పూర్తయినప్పటికి, తదనంతర కాలం‌లో ప్యాలెస్ ఆధునీకరణ పనులు జరిగాయి. ఈ ఆధునీకరణ పనులలోనే ప్రజా దర్బార్ నిర్మించారు. ప్యాలెస్ భవనం తూర్పు దిక్కు అభిముఖంగా ఉంటుంది. రాజ భవనం‌లోనికి ప్రవేశించడానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ప్రవేశ ద్వారాన్ని ‘జయ మార్తాం‌‌డ ద్వారం’ అని, ఉత్తర ప్రవేశ ద్వారాన్ని ‘జయరామ ద్వారం’ అని, దక్షిణ ప్రవేశ ద్వారాన్ని ‘బల...

రాజప్రాసాదాల నగరం మైసూరు

మైసూరు ప్యాలెస్ మైసూరు నగరాన్ని కర్ణాటక రాష్టానికి సాంస్కృతిక రాజధానిగా పేర్కొంటారు. ఈ నగరములో రాజరిక వారసత్వాన్ని ప్రతిబింబించే పెద్ద రాజ భవనాలు, విశాలమైన రోడ్లు, మ్యూజియంలు, సరస్సులు, ప్రఖ్యాత పట్టు చీరలు, యోగా కేంద్రాలు, చందనం తోటలు వంటి ఎన్నో ప్రత్యేకతలు సందర్శకులకు ఎప్పటికి మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. పర్యాటకులు ఈ నగరాన్నే ‘ఐవరీ సిటీ’ లేదా ‘రాజప్రాసాదాల నగరం’ అని పిలుస్తుంటారు. ఇక్కడి గంధపు ఉత్పత్తులు ఈ నగరాన్ని ‘శాండల్ ఉడ్ సిటి’ అని పేరు తెచ్చిపెట్టాయి. మైసూరు నగరంలో యోగా కేంద్రాలు అధికంగా కనపడే కారణంగా దీనిని ‘యోగా సిటి’ అని కూడా పిలుస్తుంటారు. పురాణ ప్రాశస్థం: మహిషాసురుని విగ్రహం ముందు భారతీయ ఇతిహాసాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించేవాడు. అతని పేరుతోనే ఈ ప్రాంతానికి ‘మహిష - ఊరు’ అని నామకరణం చేయబడింది. కాలక్రమేణా అది ‘మహిషూరు’గా రూపొంది, ఆంగ్లేయుల రాకతో అది “మైసూరు”గా స్ధిరపడింది. ఈ రాక్షసుడుని ఇక్కడి ప్రాంత ప్రజలు కొలిచే చాముండి దేవి సంహరించినట్లు చెపుతారు. నేటి మైసూరు నగరానికి తూర్పున ఉన్న కొండపై చాముండేశ్వరీ దేవాలయం నెలకొని ఉంటుంది. ...

అల వైకుంఠపురం సినిమా నుంచి "సామజవరగమనా" పాట

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలు నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తె ఎలా నిట్టూర్చవటే నిష్టూరపువిలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు మల్లెల్ల మాసమా మంజుల హాసమా ప్రతి మలపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన ఫించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నెల వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే...

దేవనహళ్ళి: టిప్పు సుల్తాన్ జన్మ స్థలం

దేవనహళ్ళి కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు గ్రామీణ జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఇది బెంగుళూరు నగరానికి 35 కి.మీ.ల దూరంలో ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం వలన ఈ ప్రాంతము రియల్ఎస్టెట్ వ్యాపారానికి ప్రసిద్దిగాంచినది. అంతేకాకుండా ఈ ప్రదేశం పర్యాటక మరియు వారసత్వ సన్నిధిగా పేర్కొనవచ్చు. 18వ శతాబ్దం‌లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని సవాల్ చేసి, వారికి ఎదురొడ్డి పోరాడిన టిప్పు సుల్తాన్ ఇక్కడే జన్మించినాడు. నేను హైదరాబాద్ నుండి బెంగళూరుకు ప్రయాణించేటప్పుడు జాతీయ రహదారి (NH-7) లో దేవనహళ్ళి గ్రామం‌లో ప్రభుత్వ ఆర్కియాలజి సర్వే వారి హోర్డింగ్ మరియు కోట ఆసక్తిగొలుపినది. కొంత కాలం తరువాత నేను దేవనహళ్ళిని సందర్శించడం జరిగినది. దేవనహళ్ళి చరిత్ర: దేవనహళ్ళి కోట దేవనహళ్ళి తొలుత గంగవాడి రాజుల పాలనలో తరువాత రాష్ట్ర కూటులు, పల్లవుల, చోళుల, హోయసల, విజయనగర రాజుల పరిపాలనలో ఉండినది. విజయనగర రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు స్థానిక పాలెగాడైన ‘రణ బైర గౌడ’ కుమారుడు ‘మల్ల బైరె గౌడ’ ఈ ప్రాంతం‌లో 1501 సంవత్సరములో కోటను నిర్మించాడు. తొలుత ఇది మట్టితో నిర్మించారు...

శ్రీ రంగపట్టణంలోని శ్రీ రంగనాధ స్వామి ఆలయం

కర్ణాటక రాష్ట్రములోని మాండ్య జిల్లాలో గల శ్రీ రంగపట్టణం లోని శ్రీ రంగనాధ స్వామి ఆలయం దక్షిణ భారతదేశం‌లోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం మైసూరు నగరానికి అతి సమీపములో ఉన్నది. ఇక్కడ వెలసియున్న శ్రీ రంగనాధ స్వామి వలన ఈ పట్టణానికి శ్రీ రంగపట్టణం అనే పేరు వచ్చింది. దీనినే శ్రీ రంగపట్న లేదా శిరంగ పట్టణ్ అని కూడా అంటారు. ఈ ప్రదేశం చుట్టూ కావేరి నది రెండు పాయలుగా ప్రవహించుట వలన శ్రీ రంగపట్టణం ఒక సుందర ద్వీపం‌లా కనుపడుతుంది. శ్రీ రంగనాథుడు: పాల సముద్రంలో శేష పానుపుపై పవళించి ఉండే భంగిమలో కనిపించే శ్రీ రంగనాథుడిని శ్రీ మహా విష్ణువు స్వరూపాలలో ఒకటిగా భక్తులు కొలుస్తుంటారు. ఈ క్షేత్రం‌లో స్వామి వారు కావేరి సమేతంగా దర్శనమిస్తాడు. అయితే ఉత్సవ మూర్తులలో మాత్రం శ్రీ దేవి, భూదేవి అమ్మవార్లు మాత్రమే దర్శనమిస్తారు. కావేరి నదికి శ్రీ రంగనాథునికి ఉన్న సంబంధం విశిష్టమైనది. దేశం‌లోని ప్రముఖ పంచ రంగ క్షేత్రాలలో మూడు క్షేత్రాలు కావేరి నది ఒడ్డునే వెలసియున్నాయి. అవి కావేరి నది మొదట్లో కర్ణాటకలోని శ్రీరంగపట్నం వెలసిన రంగనాథుడ్ని ఆది రంగ గాను, కర్ణాటక రాష్ఱం‌లోని శివన సముద్రంలో వెలిసిన రంగనాథుడ్...

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ

నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. హిందూ మస్లిం‌‌లు ఐక్యమత్యం‌తో జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి. దర్గాలోని షహీద్‌లను దర్శించుకునేందుకు దేశం‌ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కుల మతాలకు అతీతంగా భక్తులందరూ ఒక్కటై రొట్టెలు పంచుకునే ఈ రొట్టెల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రోగాలు నయమవుతాయని, వివాహ, ఉద్యోగ, సంతానం, ఆయురారోగ్యాలు సిద్ధిస్థాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు ఇంటి వద్ద రొట్టె (చపాతీ) లను తయారు చేసుకువచ్చి, స్వర్ణాల చెరువులోని నీళ్ళల్లో దిగి రొట్టెలను మార్పిడి చేసుకుంటారు. కోరిన కోర్కెకు సంభంధించిన రొట్టెను స్వీకరించి బదులుగా మరుసటి ఏడాది ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువులో భక్తులకు పంచుతారు. బారా షహీద్ దర్గా: మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచానికి అందజేయుటకు 12 మంది మత బోధకులు భారత దేశానికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా వీరు నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలములోని గండవరం చేరగా, గండవరం చెరువు వద్ద వీరికి మరియు ఇస్లామేతరులకు యుద్దం జరిగినది. ఈ యుద్దం‌లో వీరు మరణం చెందారు. వీరి తల...