Image courtesy: Asif Methar (www.pexels.com) ఇండియా గేట్ (India Gate) న్యూ ఢిల్లిలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటి. నేను వృత్తి రీత్యా గుర్గావ్‌లో ఉన్నప్పుడు ఇండియా గేట్ దర్శించడం జరిగినది. ఈ పోస్ట్‌లో ఇండియా గేట్ విశేషాలు తెలుపుతాను. ఇండియా గేట్ చరిత్ర: భారతదేశపు రాజధాని నగరం న్యూ ఢిల్లిలోని రాజ్‌పథ్‌లో గల ఈ స్మృతి చిహ్నాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మరియు మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఆంగ్లేయుల తరపున పోరాడుతూ అసువులు బాసిన 90 వేల మంది భారతీయ అమర జవాన్ల జ్ఞాపకార్థం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం వారు కట్టించారు. బ్రిటీష్ ఇంజనీరు అయిన సర్ ఎడ్విన్ లుటియెన్స్ ఇండియా గేట్ స్మారక కట్టడాన్ని రూపకల్పన చేయగా, తేది 10-02-1921 న డ్యూక్ ఆఫ్ కన్నాట్ పునాదిరాయి వేసాడు. 10 సంవత్సరాల అనంతరం తేది 12-02-1931 న లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రారంభంలో ఈ స్మృతి చిహ్నాన్ని 'ఆలిండియా మెమోరియల్ వార్'గా పిలిచేవారు. ఇండియా గేట్ డిజైన్: ఈ కట్టడం పారిస్‌లో గల ‘ఆర్చ్-డీ-ట్రయంఫ్’ (Arc de Triomphe) నిర్మాణ శైలి పోలి ఉంటుంది. భరత్ పూర్ ప్రాంతానికి చెందిన ఎరుపు రంగు గ్రానైట్‌తో ఈ స...
Telugu Travel Blog - Travelog తెలుగు ట్రావెల్ బ్లాగ్