ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

వడక్కునాథన్ దేవాలయం, త్రిసూర్, కేరళ

వడక్కునాథన్ దేవాలయం (Vadakkunnathan Temple) కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. కైలాస అధిపతి అయిన మహా శివుడు, ఈ దేవాలయంలో "వడక్కు నాథర్"గా పూజలందుకుంటున్నారు. "వడ" అనగా ఉత్తర ప్రాంతం, "నాథర్" అంటే అధిపతి అని స్థానిక భాషలో అర్థం. వడక్కునాథన్ దేవాలయం కేరళలోనే కాక, భారతదేశంలోనూ అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. త్రిసూర్ నగరం "దక్షిణ కైలాసం"గా ప్రసిద్ధి పొందింది. 2017 సంవత్సరంలో యునెస్కో ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. వడక్కునాథన్ ఆలయ స్థల పురాణం: వడక్కునాథన్ ఆలయ పూర్వకథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. పురాణ కథనం ప్రకారం, పరశురాముడు క్షత్రియులను తుదముట్టించిన తర్వాత తన పాప ప్రక్షాళన కోసం యజ్ఞం చేసి, తన భూమిని బ్రాహ్మణులకు దానం చేశాడు. తపస్సు చేయటానికి తగిన భూమి కోసం వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు, గొడ్డలిని సముద్రంలో విసిరితే విసిరినంత మేరకు భూమి లభిస్తుందని చెప్పాడు. పరశురాముడు గొడ్డలిని విసిరాడు, సముద్రం వెనక్కి వెళ్లి కొంత భూమిని ప్రసాదించింది. ఈ భూమి కేరళగా ప్రసిద్ధి చెందింది. ...