పర్యాటకులకు గమ్యస్థానం అయినటువంటి మైసూరు నగరంలో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మైసూరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావన గార్డెన్స్‌ను మైసూరుకు వచ్చే పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రాంతాలలో ఒకటి. మైసూరును చూడటానికి వచ్చే యాత్రికులు నగరానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ (KRS డ్యామ్) తీరాన ఉన్న ఈ ఉద్యానవనం విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉద్యానవనాన్ని సందర్శించటానికి ప్రతి సంవత్సరము సుమారు ఇరవై లక్షలు పైగా యాత్రికులు వస్తుంటారని అంచనా. ఒకప్పుడు కృష్ణ రాజేంద్ర టెర్రస్ గార్డెన్స్ అని పిలిచే ఈ అందమైన ఉద్యనవనాన్ని కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ దిగువున కృష్ణరాజ వడయార్‌చే 1927 సంవత్సరంలో ప్రారంభించబడి 1932 వ సంవత్సరంలో పూర్తిచేయబడినది. కృష్ణ రాజ సాగర్ డ్యాంను భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యంలో కృష్ణరాజ వడయార్ - IV పేరు మీదుగా నిర్మించగా, డ్యాం క్రింది ప్రాంతంలో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో కల ఈ ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ సారధ్యంలో కట్టించెను. ప్రకృతి ప్రేమికులు బృందావనంలోని అందమైన మొక్కలు, పచ్చిక బయళ...
Telugu Travel Blog - Travelog తెలుగు ట్రావెల్ బ్లాగ్